సుడిగాలి సుధీర్‌కు అంత సీన్ లేదు.. అనసూయకు అన్నీ వచ్చు..

అనసూయ భదర్వాజ్ సుడిగాలి సుధీర్ (anasuya sudigali sudheer)

Anchor Ravi Pradeep: యాంకర్ రవి, ప్రదీప్ ఎంత మంచి ఫ్రెండ్స్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరూ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా క్లాస్ యాంకరింగ్‌తో ప్రదీప్..

  • Share this:
యాంకర్ రవి, ప్రదీప్ ఎంత మంచి ఫ్రెండ్స్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరూ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా క్లాస్ యాంకరింగ్‌తో ప్రదీప్.. మాస్‌లో రవి రప్ఫాడిస్తుంటారు. అయితే ఎప్పుడూ టీవీల్లో బిజీగా ఉండే ఈ ఇద్దరూ ఇప్పుడు లాక్ డౌన్ కావడంతో ఇంట్లోనే లాక్ అయిపోయారు. దాంతో టైమ్ పాస్ ఎలా చేయాలో అర్థం కాక.. ఏది పడితే అది చేస్తున్నారు. ఇప్పుడు కూడా వీడియో కాల్ మాట్లాడుకుంటూ నానా రచ్చ చేసారు ఈ ఇద్దరు యాంకర్స్. ముఖ్యంగా రవిని పట్టుకుని ఆడుకున్నాడు యాంకర్ ప్రదీప్‌.

యాంకర్ ప్రదీప్ రవి (ravi pradeep)
యాంకర్ ప్రదీప్ రవి (ravi pradeep)


అంతా బి ది రియల్ మ్యాన్ ఛాలెంజ్ చేస్తుంటే నువ్వు ఎందుకు చేయలేదని రవి తన స్నేహితుడు ప్రదీప్‌ను అడిగాడు. దానికి ప్రదీప్ కూడా అంతే చిలిపిగా సమాధానం చెప్పాడు. తన ఇంట్లో చీపురు లేదని.. ఎవరో ఎత్తుకుపోయారని.. ఇప్పుడు బయటికెళ్లి చీపురు తెచ్చుకోలేను కాబట్టి పనులు చేయలేదని చెప్పాడు. దానికి రవికి విసుగుపుట్టి లత్కోర్ సమాధానాలు ఇవ్వకు అంటూ రవి ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత నువ్వు ఈ లాక్ డౌన్‌లో ఎవర్ని నీతో పాటు ఇంట్లో ఉంచుకోవాలనుకుంటున్నావని రవి అడిగితే.. నాకు కాజల్ అగర్వాల్‌ కావాలని సమాధానం చెప్పాడు ప్రదీప్.

సుడిగాలి సుధీర్, యాంకర్ ప్రదీప్, రవి (Image: Facebook)
సుడిగాలి సుధీర్, యాంకర్ ప్రదీప్, రవి (Image: Facebook)


అంత సీన్ లేదు.. ఆర్జీవి, పోసాని, నారాయణ మూర్తిలో ఎవరిని ఉంచుకుంటావో చెప్పంటే ఆర్జీవీ కావాలన్నాడు ప్రదీప్. ఇక లాక్‌డౌన్ సమయంలో అనసూయ, రష్మి, శ్రీముఖిలో ఎవరు బాగా ఇంటి పనులు నేర్చుకొన్నారనే ప్రశ్నకు ప్రదీప్ జవాబిస్తూ.. అనసూయకు అన్ని పనులొచ్చు. శ్రీముఖికి పనులు వచ్చినా చేస్తుందని గ్యారెంటీ లేదు.. రష్మి గౌతమ్ నేర్చుకోవాలని కోరుకుంటున్నానని చెప్పాడు ప్రదీప్. ఇక చివరగా బత్తిరి సత్తి, హైపర్ ఆది, సుధీర్‌లో ఎవరికీ క్వారంటైన్‌‌కు స్పెల్లింగ్ రాదంటే.. తడుముకోకుండా సుధీర్ పేరు చెప్పాడు. వాడి టాలెంట్ నాకు తెలుసని సెటైర్ వేసాడు ప్రదీప్. మొత్తానికి ఈ ఇద్దరి వీడియో కాల్ బాగానే వైరల్ అవుతుందిప్పుడు.
Published by:Praveen Kumar Vadla
First published: