Anchor Ravi - Natraj Master:ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న రియాలిటీ షో బిగ్ బాస్ బాగా ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఈ షో నాలుగు సీజన్ లను పూర్తి చేసుకోగా ప్రస్తుతం ఐదవ సీజన్ మొదలయింది. ఇందులో ఈసారి 19మంది కంటెస్టెంట్ లు పాల్గొన్నారు. ఈ షో ప్రారంభమైన వారం రోజులు కూడా కాలేదు అప్పుడే గొడవలు మొదలయ్యాయి. రోజురోజుకీ మరింత ఆసక్తిగా మారుతుంది. ఇదిలా ఉంటే తాజాగా యాంకర్ రవి పై నటరాజ్ మాస్టర్ ఫైర్ అయినట్లు కనిపించింది.
ఈ సీజన్ లో బుల్లితెరపై, వెండి తెర నటులు, టీవీ యాంకర్లు, సోషల్ మీడియా సెలబ్రెటీలు పాల్గొని తమ తమ పరిచయాన్ని పెంచుకున్నారు. మొదటి రెండు రోజులు హౌస్ లో మొత్తం బాగా సందడి కనిపించింది. అందరూ తమ తమ వ్యక్తిగత విషయాల గురించి తెలుపుతూ బాగా దగ్గరయ్యారు. ఇక తర్వాత రోజు నుండి ఏకంగా గొడవలే అయ్యాయి. ఒకరిపై ఒకరు అరుచుకుంటున్నారు. అంతేకాకుండా గ్రూపులుగా విడిపోయి అవతలి వారి గురించి మాట్లాడుతున్నారు.
ఇది కూడా చదవండి: అనవసరంగా ఆమెతో గొడవ పెట్టుకున్న.. నాగార్జున పేరు వాడుతూ అలా నోరు జారిన జెస్సీ
ఇక వినాయక చవితి రోజు పండగ వాతావరణం కనిపించింది. అందరూ ఫెస్టివల్ మూడ్ లో ఉండగా బిగ్ బాస్ వారికి ఒక టాస్క్ కూడా ఇచ్చాడు. గణపతి పూజ తర్వాత ఇంట్లో వాళ్ళందరూ ఒకేసారి ఎమోషనల్ గా కనిపించారు. ఇక బిగ్ బాస్ 'గుండలోని రుచుల జాడవేరు' అనే పేరుతో ఒక టాస్క్ ఇచ్చాడు. అందులో పైన కొన్ని కుండలు వేలాడుతూ ఉండగా వాటిని పగలగొట్టి లగ్జరీ బడ్జెట్ ఐటమ్స్ ను పొందడానికి అవకాశం ఇచ్చారు. ఇక ఇందులో ఇద్దరు మాత్రమే పాల్గొనగా.. అందులో ఒకరి భుజంపై మరొకరు కూర్చొని పైగా కళ్ళకు గంతలు కట్టుకొని.. కుండలు కొట్టడానికి ప్రయత్నం చేయాలి ఆ కంటెస్టెంట్.
ఇది కూడా చదవండి:బిగ్ బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్న మరో హాట్ బ్యూటీ.. ఎవరంటే?
మొత్తానికి ఇందులో శ్రీ రామ్ చంద్ర, విశ్వ కు ఓట్లు వేయగా నటరాజ్ మాస్టర్ మాత్రం ఎవరికి ఓటు వేయలేదు. దాంతో రవి.. మీరు ఒకరికి కూడా ఓటు వేయలేదు అనడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు మాస్టర్. ఇక పైన ఉండే వాళ్ళ పేర్లు చెప్పమంటూ సిరి అనడంతో.. వెంటనే నటరాజ్ మాస్టర్.. కండలు చూడకూడదు.. ఎవరికి ఎంత స్టామినా ఉందో చూడాలి.. ఇలాంటివి మస్తు చూశాను.. లైట్ తీసుకున్న.. ఒకరిని కాదు ఇద్దరిని లేపుతాను.. విశ్వ ఒక్కడికే కండలు ఉన్నాయా.. అతడు ఒక్కడే చేయగలడా.. నాలుగు పేరు చెబితే ఓటేశారు.. నా పేరు చెబితే ఓటు వేసేవారు కదా అని అనడంతో వెంటనే రవి మాస్టర్ కు చెప్పే ప్రయత్నం చేస్తాడు. దీంతో మాస్టర్ కాస్త గొడవ పెట్టుకున్నట్లుగా కనిపించగా.. అన్నా నేను అడిగినోడ్ని చెడ్డవాడిని అయ్యానా అంటూ.. నేను కూడా అడిగాను కదా అన్నా అంటూ సర్ది చెప్పగా అప్పుడు నటరాజ్ మాస్టర్ కూల్ అయ్యాడు. ఎలిమినేషన్ రౌండ్ లో కూడా రవి, నటరాజ్ మధ్య జరిగిన గొడవ గురించి అందరికీ తెలిసిందే. దీంతో ఈ ఎపిసోడ్ ను చూసిన ప్రేక్షకులు చిన్న మాటకు ఎందుకు ఇంత పెద్దగా చేస్తున్నారు అంటూ కామెంట్లు పెట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.