Anchor Rashmi: స్టేజ్ మీదే ముద్దు పెట్టాడు.. పెళ్లికి రెడీ అంటున్న రష్మీ.. అతడెవరంటే?

Anchor Rashmi

Anchor Rashmi: బుల్లితెరపై గత కొన్ని సంవత్సరాల నుంచి ఎనలేని క్రేజ్ సంపాదించుకున్న ఈ కార్యక్రమం ఏదైనా ఉందంటే ఆది ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమం అని చెప్పవచ్చు.

  • Share this:
    Anchor Rashmi: బుల్లితెరపై గత కొన్ని సంవత్సరాల నుంచి ఎనలేని క్రేజ్ సంపాదించుకున్న ఈ కార్యక్రమం ఏదైనా ఉందంటే ఆది ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమం అని చెప్పవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీలో దూసుకుపోతూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ జబర్దస్త్ వేదిక ఎంతో మందికి ఇండస్ట్రీలో అవకాశాలను కల్పించిందని చెప్పవచ్చు. ప్రతి వారం ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

    ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమం మొదట్లో పలు విమర్శలకు దారి తీసిన ఆ తర్వాత ఎంతోమంది అభిమానులుగా మారారు. ప్రతిరోజు శుక్రవారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే వచ్చేవారం ప్రసారం కాబోయే ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా కమెడియన్స్ తమదైన శైలిలో హాస్యాన్ని స్పందించారు. ఇమ్మానియేల్, సుడిగాలి సుదీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శీను ముగ్గురు కలిసిన చేసిన స్కిట్ ఎంతో అద్భుతమైన కామెడీను పండించినదని చెప్పవచ్చు.

    ఈ క్రమంలోనే ఈ ప్రోమోలో భాగంగా ఆ స్కిట్ లో భాగంగా ఇద్దరు చిన్నారులు అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ ద్వారా వేదికపైకి ఎంటరయ్యారు.ఇందులో కుర్రాడు ఎంతో ముద్దుగా ఉన్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ స్టేజిపైకి ఎంటర్ అవ్వగానే చిన్నారి ఆ కుర్రాడికి ఈమె రోజా అంటూ జడ్జి రోజాని పరిచయం చేయగా ఆ బుడ్డోడు రోజాకు పడుకొని మరి నమస్కారం చేశాడు. అదేవిధంగా రష్మీని చూపిస్తూ ఈమె రష్మి అంటూ పరిచయం చేయగా.. వెంటనే కుర్రాడు వెళ్లి రష్మికు ముద్దు పెట్టాడు. ఈ క్రమంలోనే నీది పెళ్లి వయసు రా అని అనడంతో అందుకు కుర్రాడు అమ్మో నాకు పెళ్లా.. అంటూ ఆశ్చర్యపోగా అందుకు రష్మి పెళ్ళికి నేను రెడీ అంటూ ఎంతో సందడి చేసింది. ఈ క్రమంలోనే ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
    Published by:Navya Reddy
    First published: