హోమ్ /వార్తలు /సినిమా /

సుడిగాలి సుధీర్ హీరోయిన్‌కు రష్మీ స్ట్రాంగ్ వార్నింగ్...మళ్లీ టాలివుడ్‌లో కనిపిస్తే...

సుడిగాలి సుధీర్ హీరోయిన్‌కు రష్మీ స్ట్రాంగ్ వార్నింగ్...మళ్లీ టాలివుడ్‌లో కనిపిస్తే...

రష్మీ, సుడిగాలి సుధీర్, ధన్య (ఫైల్ చిత్రం)

రష్మీ, సుడిగాలి సుధీర్, ధన్య (ఫైల్ చిత్రం)

రష్మీ సైతం సుడిగాలి సుధీర్ తో కలిసి చేసి ఉంటే ప్రాజెక్ట్ మరింత సక్సెస్ అయ్యేదని వినిపిస్తోంది. సాఫ్ట్ వేర్ సుధీర్ కనుక పెద్ద హిట్ అయ్యి ఉంటే ధన్య బాలక్రిష్ణ కెరీర్ ఊపు అందుకునేదని నెట్టింట ఫ్యాన్స్ అంటున్నారు. అయితే రష్మీ మాత్రం ఈ విషయంలో కాస్త సీరియస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇంకా చదవండి ...

సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా ఎట్టకేలకు విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సాగుతోంది. జబర్దస్త్ ద్వారా తన ప్రయాణం స్టార్ట్ చేసిన సుధీర్ వెండితెరపై పూర్తి స్థాయి హీరోగా మెప్పించాడు. అయితే ఈ సినిమాలో అతడి సరసన హీరోయిన్ గా నటించిన ధన్య బాలక్రిష్ణ మాత్రం అంతగా కెమిస్ట్రీ పండించలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం ధన్యకు సుడిగాలి సుధీర్ క్రేజ్ తెలియకపోవడమే అనే టాక్ వినిపిస్తోంది. అయితే ధన్య బాలక్రిష్ణ సైతం తాను సుడిగాలి సుధీర్ పక్కన నటించేందుకు చాలా సందేహించానని, ఆఫర్ తిరస్కరిద్దాం అని అనుకున్నట్లు ధన్య చెప్పుకొచ్చింది. అంతేకాదు తన స్నేహితుల ద్వారా సుడిగాలి సుధీర్ క్రేజ్ తెలుసుకున్నాకే నటించినట్లు ధన్య పలు ఇంటర్వ్యూల్లో తెలిపింది. అయితే సుడిగాలి సుధీర్ పక్కన ధన్య సరిపోలేదని, అంతేకాదు సుడిగాలి సుధీర్ రేంజ్ ఏంటో తెలియకుండా ధన్య ఈ సినిమాను ఆషామాషీగా తీసుకుందని, అందుకే ఇద్దరి కెమిస్ట్రీ పండలేదనే వినిపిస్తోంది. అయితే ధన్య ప్లేస్ లో యాంకర్ రష్మీ అయితే సినిమా నెక్ట్స్ లెవెల్ కి వెళ్లి ఉండేదనే టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే నిజానికి ధన్య బాలక్రిష్ణ స్వతహాగా హీరోయిన్ కాదు..ఆమె గతంలో కొన్ని వెబ్ సిరీస్ లలో నటించడంతో పాటు, హీరోయిన్ల పక్కన స్నేహితురాలి పాత్రల్లో నటించింది. అలాంటి ధన్యకు సుడిగాలి సుధీర్ లాంటి స్టార్ పక్కన నటించడం చాలా గొప్పే అని, నెట్టింట సుధీర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అటు రష్మీ సైతం సుడిగాలి సుధీర్ తో కలిసి చేసి ఉంటే ప్రాజెక్ట్ మరింత సక్సెస్ అయ్యేదని వినిపిస్తోంది. సాఫ్ట్ వేర్ సుధీర్ కనుక పెద్ద హిట్ అయ్యి ఉంటే ధన్య బాలక్రిష్ణ కెరీర్ ఊపు అందుకునేదని నెట్టింట ఫ్యాన్స్ అంటున్నారు. అయితే రష్మీ మాత్రం ఈ విషయంలో కాస్త సీరియస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ధన్య ఈ సినిమా విషయంలో మరికాస్త శ్రద్ధ పెట్టిఉంటే బాగుండేదని, సుడిగాలి సుధీర్ లాంచింగ్ సినిమాలో ఇలా అశ్రద్ధగా చేయడం ఏంటని ఫైర్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.

First published:

Tags: Anchor rashmi, Anchor rashmi gautam, Jabardasth rashmi, Rashmi Gautam, Rashmi gautam anchor, Sudigali sudheer, Sudigali Sudhir

ఉత్తమ కథలు