ANCHOR RASHMI MADE INSTAGRAM REELS WITH ANIMATED SHREK WITH KISSING HIM VIDEO GOES VIRAL VB
Anchor Rashmi: అతడికి ముద్దులు పెడుతూ రచ్చ చేసిన యాంకర్ రష్మీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..
యాంకర్ రష్మి (Instgram Photos)
Anchor Rashmi: యాంకర్ రష్మీ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ.. తన అభిమానులను అలరిస్తుంటుంది. తాజగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఎప్పుడూ తన హాట్ ఫొటోలను పోస్టు చేసే యాంకర్ రష్మీ ఈ సారి ఓ ఆసక్తికరమైన వీడియోను పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో చర్చనీయాశంగా మారింది. ఇందులో ఏముందంటే..
యాంకర్ రష్మీ (Anchor Rashmi) .. జబర్దస్త్ కామెడీ షో (Jabardasht Comedy Show) చూసే ప్రతీ ఒక్కరికీ పరిచయం అక్కర్లేని పేరు. జబర్దస్త్ షోతోనే ఆమె బుల్లితెరకు పరిచయం అయ్యారు. ప్రస్తుతం ఆమె ఎక్స్ ట్రా జబర్దస్త్, డీ (Dhee) షో లు చేస్తోంది. ఇవి కాకుండా ఈ టీవీ చేసే స్పెషల్ ఈవెంట్స్ (Special Events) లో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. అయితే తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియో పోస్టు చేశారు. అందులో ఆమె ముద్దులు పెడుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral) గా మారింది. పూర్తివివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
రష్మీ సినిమాల్లో పెద్దగా క్లిక్ కాలేదు కానీ బుల్లితెర మీద రష్మీ బాగా క్లిక్ అయింది. ఆమె హోస్ట్ చేస్తున్న షోలు, పాల్గొంటున్న కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఇక ఆమె సోషల్ మీడియాలో తమ హాట్ ఫొటోలతో పాటు.. వీడియోలను కూడా పోస్టు చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు. ఇలా ఆమె అభిమానులకు టచ్ లో ఉంటున్నారు. వాస్తవానికి రష్మీ 10 సంవత్సరాల క్రితమే టాలీవుడ్ లోకి నటిగా ఎంట్రీ ఇచ్చింది. కానీ అవేమీ కలిసి రాలేదు. దీంతో ‘జబర్ధస్త్' అనే కామెడీ షోతో రష్మీ గౌతమ్ యాంకర్‌గా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకుని తక్కువ టైమ్‌లోనే ఎక్కువ గుర్తింపును అందుకుంది.
ఆ తర్వాత ఆమె 2016 సంవత్సరంలో గుంటూరు టాకీస్ సినిమాతో కాస్త బ్రేక్ వచ్చింది అనుకున్నా... ఆ తర్వాత రాజు గారి బంగ్లా, అంతం, తను వచ్చెనంట లాంటి సినిమాలు చేసింది. వాటిలో ఒక్కటి కూడా సరిగా వర్కౌట్ కాలేదు. ఇలా సినిమాల్లో ఎన్ని నటించిన అనుకున్నంత ఫేమ్ మాత్రం సంపాదించలేకపోయింది. షోలో మాత్రం ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. జబర్దస్త్ లో మంచి కమెడియన్ గా పాపులారిటీ తెచ్చున్న సుడిగాలి సుధీర్ కారణంగానే ఆమె స్టార్ ను చేసింది. వీరిద్దరు కలిసి ఈ షోలో చేసే రచ్చ మాములుగా ఉండదు.
ఈ షోలో సుడిగాలి సుధీర్ తో ప్రేమాయాణం సాగిస్తుందన్న పుకార్లే ఆమెకు ఎక్కువగా క్రేజ్ ను తెచ్చి పెట్టింది. ఈ క్రమంలోనే ఆమె తరచూ షోలో సుధీర్ తో రొమాన్స్ చేస్తున్నట్లు.. వారిద్దరి మధ్య ఏదో ప్రేమ నడుస్తున్నట్లు చూపిస్తుంటారు. ఇదే ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేస్తుంది. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఎప్పుడూ తన హాట్ ఫొటోలను పోస్టు చేసే యాంకర్ రష్మీ ఈ సారి ఓ ఆసక్తికరమైన వీడియోను పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో చర్చనీయాశంగా మారింది. ఇందులో ఏముందంటే.. ష్రెక్ అనే ఒక యానిమేటెడ్ క్యారెక్టర్ తన పక్కనే ఉన్నట్టు వీడియో చేసింది. అందులో ఆమె దానికి ముద్దులు పెడుతూ రచ్చ చేసింది. ఈ వీడియోను ఇక్కడ మీరు కూడా చూసేయండి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.