ఢీ షోలో లాక్ డౌన్ తర్వాత సుడిగాలి సుధీర్, రష్మీ రీఎంట్రీ ఎలా ఉంటుందా..అని అంతా ఎదురు చూశారు. కానీ అందుకు తగ్గట్టుగానే...సుధీర్, రష్మీ జంట చక్కటి సాంగ్ తో ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు...రష్మీ కోసం గడ్డం పెంచి దేవదాసులా ఎంట్రీ ఇచ్చాడు. దానికి రష్మీ కూడా చాలా ఫీల్ అవుతూ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. కానీ అంతలోనే ఏమైందో ఏమో తెలీదు..రష్మీ కాస్త చనువు ఇచ్చింది కదా...అని సుధీర్ రెచ్చిపోయాడు. ఎప్పటి లాగానే యాంకర్ ప్రదీప్ తో గొడవ పెట్టుకున్నాడు. మాట మాట పెరిగింది. సడెన్ గా రష్మీ చేయి పట్టుకొని లాగాడు...అంతేకాదు తాను రష్మీ చేయి పట్టుకుంటే సగం పెళ్లి అయిపోయినట్లే అంటూ అందరి ముందు అరిచాడు. కానీ ఈ విషయం రష్మీ కాస్త సీరియస్ గా నే తీసుకున్నట్లు తెలిసింది. సందు దొరికింది కదా అని సుధీర్ ఇలా రెచ్చిపోవడంతో నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు. లాక్ డౌన్ తో బాగా గ్యాప్ రావడంతో సుధీర్ సడెన్ గా రష్మీ కనిపించేసరికి ఏం చేయాలో అర్థం కాక ఆనందంలో ఇలా చేసి ఉంటాడని అంతా అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor rashmi, Dhee Dance Reality Show, Jabardasth, Software sudheer, Sudigali sudheer