Jabardasth - Rashmi: మూగ జీవాలంటే యాంకర్ రష్మికి చాలా ఇష్టమన్న విషయం అందరికీ తెలిసిందే. మూగ జీవాలపై జాలి చూపాలని ఆమె పలు సందర్భాల్లో చెబుతూ ఉంటారు. ఈ విషయంపై తన సోషల్ మీడియాలోనూ ఆమె అవేర్‌నెస్ ఇస్తుంటారు. అవి కూడా ప్రాణం ఉన్న జీవులని.. వాటి పట్ల క్రూరత్వం మంచిది కాదని రష్మి చెబుతుంటారు. ఇక గతేడాది లాక్‌డౌన్ సమయంలోనూ రష్మి వీధి కుక్కల కోసం ఆహారం తయారు చేసుకొని బయటకు వెళ్లి మరీ పెట్టి వచ్చారు. ఆ సమయంలో చాలా మందితో తాను గొడవ కూడా పడ్డానని రష్మి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. వాటికి ఆహారం పెడుతుండే చాలా మంది తనతో పడ్డారని, తమ ఇళ్ల దగ్గర పెట్టకండి అని అన్నారని రష్మి తెలిపింది.
అలాగే ఆ మధ్యన వెంట్రుకలు ఎక్కడంటే అక్కడ పడేస్తే అవి పక్షుల కాళ్లకు చుట్టుకుంటాయని, అందుకే ఇకపై ఆ పని చేయకండని ఆమె ఓ వీడియోలో వివరించారు. ఇక మొన్నటికి మొన్న కుక్కల గురించి కూడా రష్మి ఓ పోస్ట్ పెట్టారు. మీ ఇంట్లో మనిషిగా కుక్కలను చూడలేకపోతే వాటిని ఇంటికి తెచ్చుకోకండని ఈ జబర్దస్త్ యాంకర్ గట్టి కామెంట్‌నే పెట్టారు.
View this post on Instagram
ఇక తాజాగా సర్కస్‌ల పేరిట ఏనుగుల పట్ల చూపుతున్న క్రూరత్వంపై రష్మి స్పందించారు. ఈ మేరకు కొన్ని గాయపడ్డ ఏనుగు ఫొటోలను షేర్ చేసిన రష్మి.. టూరిస్ట్ రైడ్స్‌కి నో చెప్పండి. సర్సస్‌కి నో చెప్పండి. జంతువుల శరీరాలను తీయడానికి నో చెప్పండి అని పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్‌కి నెటిజన్లు కూడా పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor rashmi, Anchor rashmi gautam, Jabardasth rashmi