పబ్లిసిటీ కోసం చీప్ ట్రిక్స్ వద్దు...సుడిగాలి సుధీర్‌పై రష్మీ గౌతం ఫైర్...

పబ్లిసిటీ స్టంట్స్ కోసం, సినిమా ప్రమోషన్స్ కోసం తన ఇమేజీని డామేజ్ చేసేలా మాట్లాడటం ఎంతవరకూ సబబు అని రష్మీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తన సన్నిహితుల దగ్గర రష్మీ వాపోయిందని టాక్ వినిపిస్తోంది

news18-telugu
Updated: December 4, 2019, 7:00 PM IST
పబ్లిసిటీ కోసం చీప్ ట్రిక్స్ వద్దు...సుడిగాలి సుధీర్‌పై రష్మీ గౌతం ఫైర్...
సుధీర్, రష్మీ (Image:Twitter)
  • Share this:
జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ప్రస్తుతం సినిమా హీరో అవతారం ఎత్తేశాడు. ఇంకేముంది మరి హీరోగారు అప్పుడే పబ్లిసిటీ స్టంట్స్ మొదలు పెట్టేశారు. ప్రస్తుతం సుధీర్ నటించిన సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా కూడా విడుదలకు సిధ్దంగా ఉంది. అయితే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సుధీర్ తన జీవితంలోని అనేక కోణాల గురించి చెబుతున్నాడు. తాజాగా ఆలీగా సరదాగా షోలో పాల్గొన్న సుధీర్ యాంకర్ రష్మీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తాజాగా దుమారం రేపుతున్నాయి. వ్యాఖ్యతగా ఆలీ వ్యవహరిస్తున్న ఈ షోలో, సుధీర్‌ను సరదాగా ఒక ప్రశ్న వేశాడు. ఒక వైపు దీపికా పడుకొనే, మరోవైపు కరీనా కపూర్ ఉంటే ఎవరిని హగ్ చేసుకుంటావ్ అంటూ వేసిన ప్రశ్నకు సుధీర్ దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చాడు. తాను రష్మీ ఎక్కడా అని అడుగుతానని ఆలీతో అన్నట్లు ప్రోమో విడుదలైంది.

అయితే సుధీర్ చేసిన కామెంట్స్ పై యాంకర్ రష్మీ సీరియస్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. పబ్లిసిటీ స్టంట్స్ కోసం, సినిమా ప్రమోషన్స్ కోసం తన ఇమేజీని డామేజ్ చేసేలా మాట్లాడటం ఎంతవరకూ సబబు అని రష్మీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తన సన్నిహితుల దగ్గర రష్మీ వాపోయిందని టాక్ వినిపిస్తోంది

First published: December 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>