ANCHOR RASHMI GAUTAM READY TO ACT IN LESBIAN CHARACTER IN TELUGU WEB SERIES SK
యాంకర్ రష్మి మరో సంచలనం.. బోల్డ్ పాత్రకు ఓకే చెప్పిందట..
Instagram/rashmigautam
గుంటూరు టాకీస్, నెక్ట్స్ నువ్వే వంటి చిత్రాల్లో అందాలు ఆరబోసింది. సెన్సార్ ఉండే వెండి తెరపైనే అందగా రెచ్చిపోయినా అమ్మడు.. ఇప్పుడు ఎలాంటి సెన్సార్ ఉండని వెబ్ సిరీస్‌లో మరెంత రెచ్చిపోతుందోనని గుసగుసలు వినిపిస్తున్నాయి.
బుల్లి తెరపై అందం, అభినయంతో ఫుల్ మార్క్స్ కొట్టేసింది యాంకర్ రష్మి. జబర్దస్త్‌లో హాట్ హాట్ అందాలతో కుర్రకారు మతులు పోగొడుతోంది. ఇటు యాంకరింగ్ చేస్తూనే అటు సినిమాల్లోనూ నటిస్తోంది. ఐతే జబర్దస్త్‌లో హిట్టయినంతగా వెండి తెరపై ఆకట్టుకోలేకపోతోంది రష్మి. దాదాపు 20కి పైగా చిత్రాల్లో నటించినా రావాల్సినంత క్రేజ్ మాత్రం రాలేదు. 2002లో చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీకి ఇప్పటి వరకు హిట్ పడలేదు. గుంటూర్ టాకీస్, నెక్ట్స్ నువ్వే, అంతకు మించి వంటి సినిమాల్లో అందాల ఆరబోత చేసినా ఆ చిత్రాలు పెద్దగా ఆడలేదు. ఈ క్రమంలో వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టింది ఈ హాట్ యాంకర్.
ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్లో వెబ్ సిరీస్‌ల ట్రెండ్ నడుస్తోంది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ 5, సన్ నెక్ట్స్ వంటి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో వెబ్ సిరీస్‌లు దుమ్ము రేపుతున్నాయి. దాంతో పెద్ద పెద్ద స్టార్స్ సైతం సినిమాలు చేస్తూనే వాటిలో నటిస్తున్నారు. కియారా అద్వానీ, రాధికా ఆప్టే, భూమి పడ్నేకర్, నేహా దూపియా, మనీషా కోయిరాలా సహా పలువురు తారలు లస్ట్ స్టోరీస్‌లో నటించారు. బెడ్ రూమ్ సీన్లు, సెమీ న్యూడ్ సీన్లతో ఆ వెబ్ సిరీస్‌లు సంచలనం సృష్టించాయి.
రష్మీ గౌతమ్ (Source: Twitter)
ఇప్పుడు వారి బాటలోనే ఓ వెబ్ సిరీస్‌కు హాట్ యాంకర్ రష్మి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. రష్మి ఏకంగా లెస్బియన్ పాత్రలో నటించబోతుందని సమాచారం. అందులో బాత్రూం సీన్స్, బెడ్ రూమ్ సీన్స్ కూడా ఉన్నాయని.. వాటిలో నటించేందుకు సిద్ధమని రష్మి చెప్పినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలు సినిమాల్లో హాట్ హాట్ సన్నివేశాల్లో నటించింది రష్మి. గుంటూరు టాకీస్, శివ రంజని వంటి చిత్రాల్లో అందాలు ఆరబోసి రెచ్చిపోయింది. సెన్సార్ ఉండే వెండి తెరపైనే అందగా రెచ్చిపోయినా అమ్మడు.. ఇప్పుడు ఎలాంటి సెన్సార్ ఉండని వెబ్ సిరీస్‌లో మరెంత రెచ్చిపోతుందోనని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఐతే రష్మిమీ లెస్బియన్ పాత్రలో నటించబోతుందన్న వార్తలు మాత్రం ఆమె అభిమానులను షాక్‌కు గురిచేస్తున్నాయి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.