రష్మీ గౌతమ్ పేరు తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. యూత్‌లో రష్మీకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో కూడా సందడి చేస్తున్నారు. రష్మీ. అయితే రష్మీ పలు విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు. ఇక, సుధీర్, రష్మిల జోడి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఎనిమిదేళ్లుగా ఈ జోడి ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఎన్నిసార్లు చూసిన బోరు కొట్టని జంట వీరిది. అయితే సుధీర్, రష్మీల వ్యక్తిగత విషయాలకు సంబంధించి పలు సందర్బాల్లో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా వారి పెళ్లి గురించి అయితే ఎన్నిసార్లు వార్తలు వచ్చాయో చెప్పాల్సిన పనే లేదు. అలాగే వారిపై ట్రోల్స్ చేసేవారు కూడా లేకపోలేదు.
అయితే ఇలాంటి వాటిని సుధీర్, రష్మీ పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. వాటిపై స్పందించకుండా వారి పని వారు చేసుకుంటూ ఉండిపోతారు. ఓ ఇంటర్యూలో తమపై వచ్చే సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై సుధీర్ స్పందించారు. మా వాళ్ల వారికి పని దొరుకుతున్నందుకు ఆనందంగా ఉందని సుధీర్ చెప్పాడు. కానీ ‘సుధీర్ వాళ్ల ఇంట్లో విషాదం.. శోకాసంద్రంలో రష్మీ’ అని రాశారు.. ఇలాంటివి చూస్తే చాలా బాధగా అనిపిస్తుందని అన్నారు. ఇక, రష్మీ కూడా పెద్దగా ట్రోల్స్‌ను పట్టించుకోనని చెప్పింది.
తాజాగా ట్రోల్స్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ రష్మీ కామెంట్ చేసింది. వర్షకు ధైర్యం చెబుతూ రష్మీ ఈ మాట చెప్పింది. ఇది ఎక్స్‌ట్రా జబర్దస్త్ తాజా ఎపిసోడ్‌లో చోటుచేసుకుంది. తనపై వస్తున్న ట్రోల్స్ గురించి వర్ష.. జబర్దస్త్ స్టేజి మీద ఎమోషన్ అయింది. జబర్దస్త్ సెట్‌లో వేరుగా ఉంటుంది, బయట వేరుగా ఉంటుందని ఎమోషనల్ అయింది. ఇక్కడ తమకు అందరూ గౌరవం ఇస్తారని.. బయట మాత్రం వేరేలా ఉంటుందని చెప్పింది. తనపై ట్రోల్స్ చూసి తన తమ్ముడు ఫేస్ మీద ఫోన్ పెట్టి.. ఏంటక్కా ఇది అని అడిగితే తట్టుకోలేకపోయానని చెప్పింది.
ఈ సందర్బంగా స్పందించిన రష్మీ.. ‘అమ్మాయిలు, అబ్బాయిలు సమానం అని చెబుతారు. సుధీర్ ఎవరితోనైనా యాక్ట్ చేస్తే ఒప్పుకుంటారు. కానీ నేను వేరే వాళ్లతో యాక్ట్ చేస్తే ఒప్పుకోరు. రీసెంట్‌గా నాది ఓ సినిమా ట్రైలర్ విడుదలైతే.. చాలా మంది సుధీర్‌తో ఉంటే బాగుంటదని కామెంట్స్ చేశారు. ఇక్కడ అందరం వర్క్ చేస్తున్నాం.. కానీ మా పర్సనల్ లైఫ్ వేరే. కానీ వర్క్ పరంగా అది ఒప్పుకోవడం లేదు. అబ్బాయిల ఎంత మందితోనైనా పులిహోర కలిపిన పర్వాలేదు.. కానీ అమ్మాయిలు క్యారెక్టర్ పరంగా వేరే వాళ్లతోని నటిస్తే ఒప్పుకోరు. అది ఎందుకో ఎమిటో అర్థం కాదు. ట్రోల్స్ విషయానికి వస్తే.. వాళ్లు బతుకుతుందే దీని మీద. అవన్నీ అలసు పట్టించుకోవద్దు’ అని రష్మీ చెప్పింది. జస్ట్ మూవ్ ఆన్ అవ్వాల్సిందేనని పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor rashmi, Extra jabardasth, Jabardasth Varsha, Rashmi Gautam, Sudigali sudheer