యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam).. వరుస షోలు.. చేస్తూ బిజీగా మారింది. బుల్లితెరపై యాంకర్‌గా ఇస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు సరిగ్గా రాకపోయినా.. నెంబర్ వన్ యాంకర్‌గా ఎదిగింది. ఇండస్ట్రీకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చినా ఈటీవీలో వచ్చే జబర్దస్త్ కామెడీషో(Jabardast comedy show) ద్వారా మరింత దగ్గరయ్యారు రష్మి. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ.. అవకాశం వచ్చినప్పుడల్లా అడపా దడపా సినిమాలు కూడా చేస్తుంది. అప్పుడప్పుడు అందాల ప్రదర్శన కూడా చేస్తుంది రష్మీ(Rashmi). తెలుగులో విపరీతంగా క్రేజ్ సంపాదించుకున్న యాంకర్లలో రష్మి గౌతమ్ కూడా ఒకరు. జబర్దస్త్ కామెడీ షోకి యాంకర్ గా వ్యవహరిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. అయితే ఇప్పటివరకు కేవలం ఓ ఛానల్‌కు మాత్రమే పరిమితం అయినా రష్మీ.. ఇప్పుడు ఇతర టీవీ ఛానల్స్ షోలు కూడా చేస్తూ బిజీగా మారింది.
యాంకర్ రష్మీ.. ఈటీవీ మల్లెమాల ఈవెంట్స్ లో మాత్రమే కాకుండా స్టార్ మా(Star Maa) లో కూడా సందడి సందడి చేస్తోంది.ఇప్పటికే పలుసార్లు స్టార్ మా ఈవెంట్స్ లో తన డాన్స్ స్టెప్పులతో సందడి సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ బుల్లితెర స్టార్.. బిగ్ బాస్ హౌస్(Bigg Boss House) లో ప్రత్యక్షమైంది. స్టార్ మాలో త్వరలో ఒక కొత్త ప్రోగ్రాం రాబోతోంది.ఈ ఈవెంట్ లో రష్మీ డాన్స్ స్టెప్పులు వేసి రచ్చ రచ్చ చేసింది. ఈ ఈవెంట్లో రష్మీ తో పాటు మాత్రమే శేఖర్ మాస్టర్ కూడా తన స్టైల్లో దుమ్ములేపాడు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
బిగ్ బాస్ ఇంట్లో మా పరివార్ ప్రొమో ఓకటి హల్ చల్ చేస్తోంది. సీరియల్ సెలెబ్రిటీలను బిగ్ బాస్ ఇంట్లోకి పంపించేశారు.ఇక వారితో కలిసి రష్మీ, శేఖర్ మాస్టర్ వంటి వారు దుమ్ములేపబోతోన్నట్టు కనిపిస్తోంది.ఈ మేరకు వదిలిన ప్రోమోలో రష్మీ మందులోడా ఓరి మాయలోడా అంటూ రష్మీ తన డాన్స్ తో ఒక ఊపు ఊపేసింది. మరోవైపు రష్మీ మాత్రమే కాకుండా సుదీర్ కూడా స్టార్ మా లోకి జంప్ అయ్యాడు. అయితే గతంలో రష్మీ స్టార్ మా ఈవెంట్ లలో మాత్రమే కనిపించేది. కానీ సుధీర్ మాత్రం ఏకంగా సింగింగ్ షోకి యాంకర్ గా వ్యవహారిస్తున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor rashmi gautam, Bigg Boss, Rashmi Gautam, Star Maa