హోమ్ /వార్తలు /సినిమా /

Anchor Rashmi - Sudigali Sudheer: సుధీర్‌ను మామ అన్న రష్మీ.. దండం పెట్టి?

Anchor Rashmi - Sudigali Sudheer: సుధీర్‌ను మామ అన్న రష్మీ.. దండం పెట్టి?

Rashmi Gautam, Sudheer

Rashmi Gautam, Sudheer

Anchor Rashmi - Sudigali Sudheer: బుల్లితెర జబర్దస్త్ లో కమెడియన్స్ చేసే పర్ఫామెన్స్ ఒక ఎత్తు అయితే యాంకర్ రష్మీ, సుధీర్ లు చేసే రచ్చ మరొక ఎత్తు అని చెప్పాలి. ఈ జంట బుల్లితెరపై జబర్దస్త్ లోనే కాకుండా పలు షోలలో కూడా బాగా రెచ్చిపోతారు.

ఇంకా చదవండి ...

Anchor Rashmi - Sudigali Sudheer: బుల్లితెర జబర్దస్త్ లో కమెడియన్స్ చేసే పర్ఫామెన్స్ ఒక ఎత్తు అయితే యాంకర్ రష్మీ, సుధీర్ లు చేసే రచ్చ మరొక ఎత్తు అని చెప్పాలి. ఈ జంట బుల్లితెరపై జబర్దస్త్ లోనే కాకుండా పలు షోలలో కూడా బాగా రెచ్చిపోతారు. ఇక ఈ జంటను చూసి బుల్లితెర ప్రేక్షకులందరు వీరి మధ్య ప్రేమ నడుస్తుందని తెగ ప్రచారాలు కూడా చేశారు. అంతేకాకుండా వీరిద్దరి పేర్లతో సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా సుధీర్ ను మామ అని పిలిచింది రష్మీ.

జబర్దస్త్ లోనే కాకుండా ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షోలో కూడా సుధీర్, రష్మీ టీం లీడర్ గా చేస్తున్నారు. ఇక ఇందులో వీరిద్దరు కలిసి తెగ రొమాన్స్ లతో బాగా రెచ్చిపోతారు. కానీ ఇదంతా కేవలం షో కోసం మాత్రమే చేస్తుంటామని.. ప్రేక్షకులను మరింత ఆకట్టుకోవడానికి మాత్రమే ఇలా పర్ఫామెన్స్ చేస్తుంటామని.. అంతేకానీ మా మధ్య ఎటువంటి రిలేషన్ లేదు అని చాలాసార్లు పలు ఇంటర్వ్యూలలో తెలిపారు.

కానీ కొందరు ప్రేక్షకులు మాత్రం వీరి మధ్య జరిగే కొన్ని సీన్ లను చూసి వీరిపై తెగ మండిపడుతున్నారు. ఎంత షో కోసమైనా ఇలా ప్రవర్తించడం కరెక్టు కాదు అని ఎన్నో కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా వాళ్లు మాత్రం తమ రొమాన్స్ లతో ఇంకా రెచ్చిపోతూనే ఉన్నారు. అలా ఏ షో లోనైనా ఈ జంట చేసే రచ్చకు మాత్రమే కొందరు అభిమానులు షో లను చూస్తుంటారు.

' isDesktop="true" id="989614" youtubeid="Zvo3giNSo1A" category="movies">

ఇదిలా ఉంటే తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో విడుదలయింది. ఇందులో కొందరు పిల్లలు ఎంట్రీతో బాగా సందడి చేయగా.. అందులో సుడిగాలి సుధీర్ వారితో కొన్ని మాటలు మాట్లాడి రివర్స్ తనే పంచ్ లు వేయించుకున్నాడు. ఇక.. ఏది ఒకసారి మామయ్య అనండమ్మా అని అనేసరికి పిల్లలందరూ మామయ్య అని గట్టిగా పిలిచారు. ఇక పిల్లలు తర్వాత రష్మీ గట్టిగా మామయ్య అని సుధీర్ ను పిలిచింది. వెంటనే సుధీర్ తనకు తల వంచి వద్దు అన్నట్లు దండం పెట్టగా.. అక్కడున్న వాళ్లంతా తెగ నవ్వుకున్నారు.

First published:

Tags: Anchor rashmi, Jabardasth, MLA Roja, Singer manu, Sudigali sudheer

ఉత్తమ కథలు