Sudigali Sudheer- Rashmi Gautam: తెలుగు బుల్లితెరపై రొమాంటిక్ కపుల్ అనగానే.. అందరికీ సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ పేర్లు వెంటనే గుర్తొస్తాయి. బుల్లితెరపై వారిద్దరిని షారూక్- కాజల్ జోడీగా అభివర్ణిస్తూ ఉంటారు. వాళ్లు కనిపిస్తే చాలు టిఆర్పీ రేటింగ్స్ కూడా పరుగులు తీస్తూ వస్తుంటాయి. అందుకే వాళ్లతో ప్రోగ్రామ్స్ చేయడానికి ఛానెల్స్ కూడా పోటీ పడుతుంటాయి. ఈ క్రమంలో ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ ఈటీవీ కూడా వీరిద్దరితో ఇప్పటికే చాలా షోలు చేసి విజయం సాధించింది. అంతేకాదు వీరిద్దరి రిలేషన్‌పై చాలా మంది కమెడియన్లు స్కిట్లు చేసి విజయం సాధించారు. ఇదంతా పక్కనపెడితే వీరిద్దరు పెళ్లి చేసుకుంటే చూడాలని చాలా మంది అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. కానీ తామిద్దరం మంచి స్నేహితులమని వీరు ఇప్పటికే చాలా సార్లు చెబుతూ వస్తున్నారు. ఇక వారు ఎంత చెబుతున్నా వారి జంటను చూసి ప్రతిసారి వీక్షకులకు మాత్రం ఈ ఇద్దరి మధ్య ఏదో ఉన్నట్లు అర్థమవుతోంది. ఇక రష్మిని తన లక్కీ పర్సన్‌గా చెప్పుకొనే సుధీర్.. ఆమెపై చాలాసార్లే ప్రేమను చూపించాడు. కానీ వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటన్నది ఇప్పటికీ సస్పెన్.
ఇదిలా ఉంటే సుధీర్ పెళ్లిపై ఇప్పటికే జబర్దస్త్‌లో పలుమార్లు స్కిట్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి సుధీర్ పెళ్లి టాపిక్‌తో అతడి టీమ్ స్కిట్ చేసింది. ఆ ఎపిసోడ్ ఈ నెల 26న రానుండగా.. దానికి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. అందులో పెళ్లి చేసుకునేందుకు సుధీర్ సిద్ధమవుతాడు. ఎవ్వరికీ చెప్పకుండా చేసుకుంటున్నావా అని గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్ అడగ్గా.. నా గురించి అందరికీ తెలుసు కదా, అందుకే ఎవ్వరికీ చెప్పుకుండా చేసుకుంటానని సుధీర్ అంటాడు.
మాక్కూడానారా అని ఆ ఇద్దరు అడగ్గా.. మీరే అస్సలు పక్కన ఉండకూడదు అని జడ్జి రోజా అంటారు. ఆ తరువాత గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ రష్మిని ఆ పెళ్లికి తీసుకొస్తారు. అక్కడ రష్మి కంట్లో ఏదో పడి తుడుచుకుంటూ ఉండగా.. రష్మి ఏడుస్తుందంటూ గెటప్ శ్రీను పెళ్లి వారితో చెబుతూ భోరున ఏడుస్తాడు. వాళ్లిద్దరు క్లోజ్‌గా ఉండేవారు, ఇద్దరు కలిసి ఎన్నో ప్రదేశాలు తిరిగారు అంటూ పెళ్లి వారికి చెబుతాడు. సుధీర్ పెళ్లిని ఆపేందుకు రామ్ ప్రసాద్‌తో కలిసి గెటప్ శ్రీను ఈ స్కిట్లో ప్లాన్లు చేస్తుండగా.. వీరి స్కిట్ ఫన్నీగా ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. మరి ఫుల్ ఎపిసోడ్ చూడాలంటే మరో వారం వరకు ఆగాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rashmi Gautam, Sudigali sudheer