యాంకర్ ప్రదీప్ దెబ్బకు తట్టుకోలేక హైపర్ ఆది...సుడిగాలి సుధీర్, రష్మీ చూస్తుండగానే...

హైపర్ ఆది, వర్షిణి (Image: Youtube)

స్కిట్ లో మేటర్ కన్నా తన పంచులతోనే మూకుమ్మడి దాడి చేసే హైపర్ ఆది. ఢీలో మాత్రం అతడి పంచులు పెద్దగా పేలడం లేదనే చెప్పాలి. పైగా ఢీలో అతడికి తోడుగా ఉన్న యాంకర్ వర్షిణి సైతం పెద్దగా యాక్టివ్ కాకపోవడంతో, హైపర్ ఆదికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది.

  • Share this:
    ఢీ షోలో ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది యాంకర్ ప్రదీప్ ధాటికి తట్టుకోలేకపోతున్నాడనే చెప్పుకోవాలి. జబర్దస్త్ లో హైపర్ ఆది తనదే సామ్రాజ్యంలా ఫీల్ అయ్యేవాడు. అయితే ఢీలో మాత్రం హైపర్ ఆది పప్పులు ఉడకట్లేదనే చెప్పాలి. స్కిట్ లో మేటర్ కన్నా తన పంచులతోనే మూకుమ్మడి దాడి చేసే హైపర్ ఆది. ఢీలో మాత్రం అతడి పంచులు పెద్దగా పేలడం లేదనే చెప్పాలి. పైగా ఢీలో అతడికి తోడుగా ఉన్న యాంకర్ వర్షిణి సైతం పెద్దగా యాక్టివ్ కాకపోవడంతో, హైపర్ ఆదికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. దీంతో తనపై అట్రాక్షన్ పెరగాలని హెయిర్ స్టయిల్ మార్చుకన్న హైపర్ ఆది, గత ఎపిసోడ్ లో యాంకర్ ప్రదీప్ వేసే సెటైర్లకు బలయ్యాడనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఢీలో ఇప్పటికే పాతుకుపోయిన సుడిగాలి సుధీర్, రష్మీ ముందు హైపర్ ఆది జోడీ నిలవడం లేదు.

    అలాగే సుడిగాలి సుధీర్, రష్మీ జోడీ కూడా ఢీలో చాలా వరకూ సక్సెస్ అనే చెప్పాలి. అయితే హైపర్ ఆది జోడి మాత్రం సరిగ్గా వర్కౌట్ కాలేదనే చెప్పాలి. అయితే యాంకర్ ప్రదీప్ పంచులతో హైపర్ ఆది, వర్షిణి జోడీని ఆడేసుకున్నాడు. ముఖ్యంగా వీరిద్దరి స్టైలింగ్ పై కామెంట్ చేయడంతో ప్రోగ్రాంలో నవ్వులు విరిసాయి. అయితే హైపర్ ఆదిమాత్రం ఇదేం గతి పట్టింది నాకు అంటూ నొచ్చుకున్నాడని టాక్ వినిపిస్తోంది.
    Published by:Krishna Adithya
    First published: