Anchor Pradeep remuneration: తొలి సినిమా కోసం యాంకర్ ప్రదీప్ షాకింగ్ రెమ్యునరేషన్..

యాంకర్ ప్రదీప్ (anchor Pradeep Machiraju)

Anchor Pradeep remuneration: యాంకర్‌గా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ప్రదీప్. ఇప్పుడు ఈయన బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈయన హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?

  • Share this:
యాంకర్‌గా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ప్రదీప్. ఇప్పుడు ఈయన బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈయన హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా జనవరి 29న విడుదలైంది. ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు మున్నా దర్శకుడు. సినిమాకు టాక్ ఎలా ఉందనే విషయం పక్కనబెడితే మంచి బజ్‌తోనే విడుదలైంది. మరోవైపు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. దాదాపు 4.3 కోట్ల వరకు ఈ సినిమాను అమ్మారు దర్శక నిర్మాతలు. ఇదిలా ఉంటే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా కోసం ప్రదీప్ ఎంత పారితోషికం తీసుకున్నాడనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిందిప్పుడు. ఎందుకంటే ఈయన బుల్లితెరపై భారీ పారితోషికం తీసుకునే యాంకర్స్‌లో ముందుంటాడు. ఒక్కో ఈవెంట్ కోసం.. ఎపిసోడ్ కోసం దాదాపు లక్షకు పైగానే తీసుకుంటాడు ప్రదీప్. అలాంటిది సినిమా కోసం ఈయన ఇంకెంత తీసుకుని ఉంటాడో అని ఆసక్తి మొదలైంది అభిమానుల్లో. దీనికి సమాధానం తెలుసుకుంటే మాత్రం షాక్ తప్పదు. ఎందుకంటే తన తొలి సినిమా కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ప్రదీప్ మాచిరాజు. నిజంగానే ఇది నమ్మడం కష్టం. కానీ ఇదే నిజం.. ఎందుకంటే ఈ విషయం ప్రదీప్ స్వయంగా చెప్పుకొచ్చాడు. మున్నా ఈ కథ చెప్పినపుడు చాలా నచ్చిందని.. వేరియేషన్స్ కూడా నచ్చాయని.. నీలినీలి ఆకాశం పాటలో కనిపించే లుక్ కోసం ఏకంగా మూడు నెలల పాటు కష్టపడ్డానని చెప్పుకొచ్చాడు ప్రదీప్.
anchor pradeep 30 rojullo preminchadam ela remuneration,anchor pradeep remuneration,anchor pradeep 30 rojullo preminchadam ela review,30 rojullo preminchadam ela movie,30 rojullo preminchadam ela movie review,30 rojullo preminchadam ela public talk,30 rojullo preminchadam ela,30 rojullo preminchadam ela movie songs,30 rojullo preminchadam ela movie public talk,30 rojullo preminchadam ela songs,30 rojullo preminchadam ela movie trailer,30 rojullo preminchadam ela public response,30 rojullo preminchadam ela genuine review,యాంకర్ ప్రదీప్,యాంకర్ ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా రివ్యూ,30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ రివ్యూ,30 రోజుల్లో ప్రేమించడం ఎలా ప్రదీప్ రెమ్యునరేషన్,యాంకర్ ప్రదీప్ రెమ్యునరేషన్
ప్రదీప్, అమృత అయ్యర్ Photo : Youtube

మరి అంత కష్టపడిన సినిమా కోసం పారితోషికం తీసుకోకపోవడం ఏంటబ్బా అనుకుంటున్నారా..? అంతే మరి.. ఒక్కోసారి అలాగే జరుగుతుంది. చందమామ కథ లాంటి సినిమాతో హీరోగా పరిచయం కావాలని అనుకుంటున్న తనకు మున్నా చెప్పిన కథ చాలా బాగా నచ్చిందని చెప్పాడు ప్రదీప్. ఈ సినిమాలోని నీలి నీలి ఆకాశం పాట ఏకంగా 300 మిలియన్ మార్క్ అందుకుని సినిమాపై అంచనాలు పెంచేసింది. సినిమాకు ముందు పారితోషికం తీసుకోకపోయినా.. విడుదల తర్వాత తీసుకుంటాడని ప్రచారం జరుగుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published: