యాంకర్ ప్రదీప్ వచ్చేసాడోచ్.. రీ ఎంట్రీలో విడుదలైన కొత్త ప్రోమో..

నాగబాబు రవి యాంకర్ ప్రదీప్

యాంకర్ ప్రదీప్‌ వచ్చేసాడు.. చాలా రోజుల నుంచి ఈయన ఎప్పుడెప్పుడు వస్తాడా అని వేచి చూస్తున్నారు అభిమానులు. అలాంటి వాళ్లకు తీపికబురు వచ్చేసింది. ప్రదీప్ మళ్లీ బుల్లితెరపై కనిపించాడు.

  • Share this:
యాంకర్ ప్రదీప్‌ వచ్చేసాడు.. చాలా రోజుల నుంచి ఈయన ఎప్పుడెప్పుడు వస్తాడా అని వేచి చూస్తున్నారు అభిమానులు. అలాంటి వాళ్లకు తీపికబురు వచ్చేసింది. ప్రదీప్ మళ్లీ బుల్లితెరపై కనిపించాడు. జీ తెలుగులో సర్లెర్లే ఎన్నెన్నో అనుకుంటాం అనే ప్రోగ్రామ్ ప్రోమో విడుదలైంది. ఇందులో యాంకర్ రవితో పాటు ప్రదీప్ కూడా ఉన్నాడు. అయితే గతంలో ఉన్న ఛార్మ్ మాత్రం ఇప్పుడు కనిపించడం లేదు. ఎందుకో తెలియదు కానీ ప్రదీప్ కాస్త తేడాగా ఉన్నాడు. బహుశా ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నాడు కదా అందుకే ఆ మొహంలో తేడా వచ్చుంటుంది అంటున్నారు అభిమానులు.

ఇక ఇదే కార్యక్రమంలో నాగబాబు కూడా ఉన్నాడు. ఆయన జడ్జ్‌గా వచ్చాడు. ప్రదీప్ చాలా రోజులుగా ఎందుకు రావడం లేదంటూ వచ్చిన ప్రశ్నలకు సమాధానం కూడా ఈ మధ్యే ఇచ్చాడు ఈయన. ఫేస్ బుక్ లైవ్ చేసి తన ఆరోగ్యంతో పాటు అన్ని విషయాలపై కూడా క్లారిటీ ఇచ్చేసాడు. నెల రోజులు షూట్ చేయలేదని.. షూట్ ఉంటే కనీసం ప్రేక్షకులతో ఏదో ఒక ఇంటరాక్షన్ ఉంటుందని.. ఇప్పుడు అది కూడా లేకుండా పోయిందని చెప్పాడు ప్రదీప్.

చాలా రోజుల నుంచి ఇంట్లో ఉండి ఉండి ఇప్పుడు ఎందుకో లైవ్ చేయాలనిపించింది.. మాట్లాడాలనిపించింది అంటూ తన సోషల్ మీడియా పేజీలో అభిమానులతో మాట్లాడాడు ఈయన. తను ఇన్ని రోజులు కనిపించకుండా పోయేసరికి చాలా మంది విషెస్ తెలియజేసారని.. బోలెడు మెసేజులు చేసారని.. కానీ తాను ఉన్న పరిస్థితుల్లో ఎవరికీ రిప్లై చేయలేదని చెప్పాడు ప్రదీప్. ఇప్పట్నుంచి మళ్లీ వరసగా షోలు చేస్తూ బిజీ అయిపోతానంటున్నాడు ఈయన. మొత్తానికి జీ తెలుగు కార్యక్రమంతోనే రీ ఎంట్రీ ఇస్తున్నాడు ఈయన. త్వరలోనే ఈటీవీ ఢీ ఛాంపియన్స్‌కు కూడా రానున్నాడు ప్రదీప్.
First published: