Super Serial Championship: యాంకర్ ప్రదీప్ కొంటె ప్రశ్నలు.. సీరియల్ హీరోయిన్ల చిలిపి సమాధానాలు!

Super Serial Championship

Super Serial Championship: ప్రస్తుతం బుల్లితెర లో ఎంటర్టైన్మెంట్ షోలు, పలు అవార్డు ఫంక్షన్ లు ఇలా ఎన్నో ప్రసారం అవుతుంటాయి. ఇక అందులో ఎంత వినోదం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

  • Share this:
    Super Serial Championship: ప్రస్తుతం బుల్లితెర లో ఎంటర్టైన్మెంట్ షోలు, పలు అవార్డు ఫంక్షన్ లు ఇలా ఎన్నో ప్రసారం అవుతుంటాయి. ఇక అందులో ఎంత వినోదం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అందులో పాల్గొనే గెస్ట్ లు కూడా తమ పర్ఫార్మెన్స్ తో బాగా అదరగొడతారు. ఇదిలా ఉంటే బుల్లితెర సీరియల్స్ వాళ్లకి సంబంధించిన పలు అవార్డు ఫంక్షన్లు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక అందులో తము చేసే సందడులు బాగా ఆకట్టుకుంటాయి. అలాంటిదే ఇప్పుడు మరో ప్రోగ్రాం జరగనుంది.




    జీ తెలుగులో సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ ప్రోగ్రాం జరగనుండగా దానికి సంబంధించిన ప్రోమోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఆ ప్రోగ్రాం కు యాంకర్ ప్రదీప్ హోస్టింగ్ చేస్తున్నాడు. ఇక ఇందులో అన్ని సీరియల్స్ వాళ్లు పాల్గొనగా తమ పర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకుంటున్నారు. ఇందులో తమ సీరియల్స్ ముందు స్థానంలో నిలవాలన్న ఉద్దేశంతో బాగా పోరాడుతున్నారు. ఇక సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ కప్ ను అందుకోవడానికి ప్రతి ఒక్క సీరియల్స్ వాళ్ళు తెగ డాన్సులతో అదరగొడుతున్నారు. ప్రస్తుతం పలు ప్రోమోలు విడుదల కాగా వాళ్ళ ఎంట్రీ తోనే ఎంతో జోష్ లో కనిపిస్తున్నారు.








    View this post on Instagram






    A post shared by Zee Telugu (@zeetelugu)






    పైగా కప్పు మాదే అంటూ గట్టిగానే సవాల్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రోమో లో ఊహలు గుసగుసలాడే సీరియల్ అస్సలు తగ్గట్లేదు. అంతేకాకుండా హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్ టీం కూడా తమ ఎంట్రీతో ఫుల్ జోష్ లో రాగా అందులో సీరియల్ హీరోయిన్ భాను.. ప్రదీప్ అడిగిన ప్రశ్నలకు తల పీక్కునేలా సమాధానమిచ్చింది. మొత్తానికి ఈ ప్రోగ్రామ్ జూన్ 20న ఆదివారం రాత్రి 8 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుండగా ఈ ప్రోగ్రామ్ కోసం ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారని తెలుస్తుంది. ఇక చాలామంది తమ అభిమాన సీరియల్ గెలవాలని తెగ కామెంట్స్ చేస్తున్నారు.
    Published by:Navya Reddy
    First published: