యాంకర్ ప్రదీప్ ఇంట్లో కూర్చుని ఏం చేస్తున్నాడో చూడండి..

Anchor Pradeep: యాంకర్ ప్రదీప్ కూడా ఇంట్లో చాలా పనులే చేస్తున్నాడు. ముఖ్యంగా ఎప్పుడూ బయట షూటింగ్స్ చూస్తూ ఉంటాను కదా.. ఇంటి పనులు అంటే ఏంటో తెలియదంటున్నాడు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 29, 2020, 8:49 PM IST
యాంకర్ ప్రదీప్ ఇంట్లో కూర్చుని ఏం చేస్తున్నాడో చూడండి..
యాంకర్ ప్రదీప్ (Anchor Pradeep)
  • Share this:
లాక్ డౌన్ కావడంతో ఇంట్లో ఏం చేయాలో తెలియక చాలా పనులు చేస్తున్నారు మన సెలబ్రిటీస్. ఎప్పుడూ బయట షూటింగ్స్ చేసుకుంటూ.. ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండని వీళ్లందరికీ ఇప్పుడు ఇల్లు తప్ప మరో ప్రపంచమే లేకుండా పోయింది. ఒక్క అడుగు కూడా బయటికి వేయడానికి లేకుండా పోవడంతో ఇంట్లోనే కూర్చుని చాలా ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికే అలీ ఇంటి పనులు చేస్తూ వీడియో పోస్ట్ చేసాడు. తన భార్య ఏది చెబితే అది చేస్తున్నానని చెప్పాడు. ఇక చాలా మంది సెలబ్రిటీస్ కూడా తమ కుటుంబ సభ్యులతో సమయం గడుపుతున్నారు.

Comedian Ali, homework, due to coronavirus, coronavirus,hyderabad, ఇంటి పనులు చేస్తున్న అలీ, కమెడియన్ అలీ, కరోనా, కరోనా వైరస్, హైదరాబాద్, సినిమా, సినిమా వార్తలు,
కరోనా ఎఫెక్ట్.. మా భార్య ఏ పని చెబితే.. అది చేస్తున్నానన్న కమెడియన్ అలీ


అల్లు అర్జున్ అయితే మొన్నీమధ్యే బయట సూపర్ మార్కెట్‌కు వెళ్లి సరుకులు తీసుకొచ్చాడు. ఇక ఇప్పుడు యాంకర్ ప్రదీప్ కూడా ఇంట్లో చాలా పనులే చేస్తున్నాడు. ముఖ్యంగా ఎప్పుడూ బయట షూటింగ్స్ చూస్తూ ఉంటాను కదా.. ఇంటి పనులు అంటే ఏంటో తెలియదంటున్నాడు ఈయన. అందుకే ఇంట్లోనే ఉండటంతో హాయిగా పనులు చేసుకుంటున్నట్లు చెప్పాడు. తల్లికి అప్పుడప్పుడూ సాయం చేస్తున్నాడు ఈయన.

ఈ క్రమంలోనే ఇంట్లో వంట చేసుకుంటూ వీడియో విడుదల చేసాడు. బెండకాయ్ ఫ్రై, పప్పు చేస్తున్నాను.. మా అమ్మ కుక్కర్ మూడు కూతలు కూయగానే మూసేయమని చెప్పిందంటూ ఫన్నీగా వీడియో చేసాడు ప్రదీప్. ప్రస్తుతం ఇది బాగానే వైరల్ అవుతుంది. ఈ మధ్యే 30 రోజుల్లో ప్రేమించటం ఎలా సినిమాతో హీరో అయ్యాడు ప్రదీప్. అన్నీ బాగుంటే ఈ పాటికే ఈ చిత్రం విడుదలయ్యేది. కానీ కరోనా కాటు పడింది.
First published: March 29, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading