Anchor Srimukhi Pradeep: దసరాకు యాంకర్ ప్రదీప్‌తో శ్రీముఖి పెళ్లి.. ఇదిగో వెడ్డింగ్ కార్డ్..

యాంకర్ ప్రదీప్ మాచిరాజు శ్రీముఖి (anchor srimukhi pradeep machiraju)

Anchor Srimukhi Pradeep: మీరు చదివింది నిజమే.. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే జరగబోతుంది. నిజంగానే శ్రీముఖి, ప్రదీప్ పెళ్లి చేసుకోబోతున్నారు. దీనికి సంబంధించిన పెళ్లి పత్రిక కూడా బయటికి వచ్చింది.

  • Share this:
మీరు చదివింది నిజమే.. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే జరగబోతుంది. నిజంగానే శ్రీముఖి, ప్రదీప్ పెళ్లి చేసుకోబోతున్నారు. దీనికి సంబంధించిన పెళ్లి పత్రిక కూడా బయటికి వచ్చింది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో ఈ పత్రికను చూసి అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. అయితే అసలు విషయం మరోటి ఉంది. ఈ మధ్య ఛానెల్స్‌లో ప్రతి పండక్కి ఎదో ఒక స్పెషల్ ఈవెంట్ చేస్తున్నారు. సినిమా రేంజ్‌లో ఇది ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇందులో భాగంగానే ఇప్పుడు దసరాకి కూడా ఓ ఈవెంట్ ప్లాన్ చేసింది ఓ ప్రముఖ ఛానెల్. అందులో యాంకర్స్ శ్రీముఖి, ప్రదీప్ హోస్టులుగా ఉన్నారు. దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేసారు మేకర్స్. అది యూ ట్యూబ్‌లో రప్ఫాడిస్తుంది. ఈ ప్రోమోలో చిరంజీవి ప్రదీప్‌కి చిలసౌ శ్రీముఖి నమస్కరిస్తూ వ్రాయునది అంటూ.. ఓ వెడ్డింగ్ కార్డును కూడా బయటకు వదిలారు. ఇది చూసి అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు. ఇది నిజం పెళ్లి కాదని తెలిసినా కూడా భలే ఉందిరా కార్డ్ అంటూ ముచ్చట పడుతున్నారు.
యాంకర్ ప్రదీప్ మాచిరాజు శ్రీముఖి (anchor srimukhi pradeep machiraju)
యాంకర్ ప్రదీప్ మాచిరాజు శ్రీముఖి (anchor srimukhi pradeep machiraju)

గతంలో కూడా ఓ సారి సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్‌కు ఇలాగే పెళ్లి చేసింది ఈటీవీ. అప్పట్లో ఆ పెళ్లి ప్రోమోతో పాటు ఈవెంట్ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పటికీ యూ ట్యూబ్‌లో ఈ పెళ్లి వీడియోను చూసి నిజంగానే ఈ ఇద్దరికి పెళ్లైపోయిందా అని అడిగేవాళ్లున్నారు. ఇప్పుడు శ్రీముఖి, ప్రదీప్ ఉత్తుత్తి పెళ్లి కూడా అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఈ వెడ్డింగ్ కార్డులో ఏముందో తెలుసుకోవాలంటే మరో పది రోజులు ఓపిక పట్టాలి. పెళ్లి పత్రికకు మాత్రమే కాదు ప్రోమోకు కూడా అదిరిపోయే స్పందన రావడంతో పండగ చేసుకుంటున్నారు నిర్వాహకులు. ఈ ప్రోమో చూసిన తర్వాత ఎప్పుడెప్పుడు ఫుల్ ఎపిసోడ్ వస్తుందా అని చూస్తున్నారు. దానికితోడు కొన్ని రోజుల నుంచి ప్రదీప్ పెళ్లి గురించి టాపిక్స్ వస్తూనే ఉన్నాయి. దాంతో అదే బేస్ చేసుకుని ఇప్పుడు ఈ ఈవెంట్ ప్లాన్ చేసారు.
యాంకర్ ప్రదీప్ మాచిరాజు శ్రీముఖి (anchor srimukhi pradeep machiraju)
యాంకర్ ప్రదీప్ మాచిరాజు శ్రీముఖి (anchor srimukhi pradeep machiraju)

ట్రెండ్ ఫాలో కావడంతో ప్రోమో కూడా వైరల్ అయిపోయింది. మరోవైపు శ్రీముఖి కూడా బుల్లితెరపై యాంకర్‌గా సత్తా చూపిస్తుంది. ఈమె కూడా సరైన వాడు దొరికితే పెళ్లి చేసుకుని సినిమాలకు, కెరీర్‌కు ఫుల్ స్టాప్ పెట్టేస్తానని చెప్పేసింది. ఇదిలా ఉంటే ప్రదీప్ ప్రస్తుతం యాంకర్‌గానే కాకుండా హీరోగానూ ఉన్నాడు. ఈయన నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో ప్రదీప్ సరసన అమృత అయ్యర్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలోని నీలినీలి ఆకాశం సాంగ్ సంచలనాలు రేపింది. ఏదేమైనా కూడా అటు సినిమాలు.. ఇటు రియాలిటీ షోలతో దుమ్ము దులిపేస్తున్నాడు యాంకర్ ప్రదీప్. మరి శ్రీముఖితో ఈయన రీల్ పెళ్లి ఎలా ఉండబోతుందో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published: