‘ఢీ’ షో నుండి ప్రదీప్ తప్పుకోవడంపై ఫ్యాన్స్ ఫీలింగ్స్ ఇవి..

యాంకర్ ప్రదీప్.. ఈ పేరు వింటే తెలుగు స్మాల్ స్క్రీన్ ఎగిరి గంతేస్తుంది. తన గాత్రంతో, సమయస్ఫూర్తితో టీవీ యాంకర్‌గా రాణిస్తూ ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్నాడు ప్రదీప్.తాజాగా పుట్టినరోజున అభిమానులు అతడు ఢీ షో నుంచి తప్పుకోవడం పై పలు ప్రశ్నలు సంధించారు.

news18-telugu
Updated: October 25, 2019, 12:52 PM IST
‘ఢీ’ షో నుండి ప్రదీప్ తప్పుకోవడంపై ఫ్యాన్స్ ఫీలింగ్స్ ఇవి..
యాంకర్ ప్రదీప్ (Source: Twitter)
  • Share this:
యాంకర్ ప్రదీప్.. ఈ పేరు వింటే తెలుగు స్మాల్ స్క్రీన్ ఎగిరి గంతేస్తుంది. తన గాత్రంతో, సమయస్ఫూర్తితో టీవీ యాంకర్‌గా రాణిస్తూ ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్నాడు ప్రదీప్.  ఈ నెల 23న ప్రదీప్ తన పుట్టినరోజును జరుపుకున్నాడు. ఈ సందర్భంగా ప్రదీప్ అభిమానుల నుంచి ఆయన బర్త్ డే విషెస్ అందుకున్నాడు. ఈ సందర్భంగా కొంత మంది అభిమానులు.. మీరు ‘ఢీ’ ప్రోగ్రామ్‌కు తప్పుకున్నారు. మళ్లీ ఎపుడు ఈ ప్రోగ్రామ్‌కు యాంకరింగ్ చేస్తారంటూ ట్వీట్ చేసాడు. ఇక తనకు బర్త్ డే విషెస్ చెప్పిన వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపాడు. మీ అభిమానం ఎపుడు ఇలానే ఉండాలి. మీరు నాతో ఎపుడు కొంచెం టచ్‌లో ఉంటే బాగుంటుందన్నారు.
View this post on Instagram

🙏🤗


A post shared by pradeep machiraju (@pradeep_machiraju) on


ప్రదీప్ మాచిరాజు ఇప్పటికే ‘ఢీ 10’, ‘ఢీ జోడి’ సీజన్లకు యాంకర్‌గా వ్యవహరించాడు. ఈ రెండు సీజన్లకు సుధీర్,రష్మీ లు టీమ్ లీడర్లుగా ఉన్నారు. అయితే.. ‘ఢీ 12’ సీజన్‌కు అన్ని ఈక్వేషన్స్ మారిపోయాయి. ఆయన ప్లేస్‌లో యాంకర్స్‌గా సుడిగాలి సుధీర్, రష్మీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 25, 2019, 12:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading