ANCHOR PRADEEP MACHIRAJU OUT OF DHEE 12 SEASON DUE TO RASHMI GAUTAM SUDIGALI SUDHEER TA
‘ఢీ’ షో నుంచి ప్రదీప్ ఔట్.. రష్మీ, సుధీర్ కారణమా..
సుధీర్ రష్మీ గౌతమ్ ప్రదీప్
తెలుగులో ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఢీ’ షోకు స్పెషల్ క్రేజ్ ఉంది. ఇప్పటికే ‘ఢీ’ ప్రోగ్రామ్ 11 సీజన్లు కంప్లీట్ చేసుకొని 12వ సీజన్లో అడుగుపెట్టింది. తాజాగా ఈ షో 12వ సీజన్లో ప్రదీప్‌ను తప్పించారు. ఆయన ప్లేస్‌లో..
తెలుగులో ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఢీ’ షోకు స్పెషల్ క్రేజ్ ఉంది. ఇప్పటికే ‘ఢీ’ ప్రోగ్రామ్ 11 సీజన్లు కంప్లీట్ చేసుకొని 12వ సీజన్లో అడుగుపెట్టింది. ఈ ప్రోగ్రామ్‌తో ఎంతో మంది డాన్సర్లు, డాన్స్ మాస్టర్స్‌ను చేసింది. తెలుగులో ‘ఢీ’ బెస్ట్ డాన్స్ షోగా గుర్తింపు పొందింది. ఐతే.. ఈ డాన్స్ షో లో కేవలం డాన్సే కాకుండా.. సుధీర్, రష్మీ గౌతమ్ రొమాంటిక్ కామెడీ.. ప్రదీప్ మాచిరాజు యాంకరింగ్ ఈ షోకు స్పెషల్ అస్సెట్‌గా నిలిచాయి. ఇక ప్రదీప్ విషయానికొస్తే.. ఈయన ఇప్పటికే ‘ఢీ 10’, ‘ఢీ జోడి’ సీజన్లకు యాంకర్‌గా వ్యవహరించాడు. ఈ రెండు సీజన్లకు సుధీర్,రష్మీ లు టీమ్ లీడర్లుగా ఉన్నారు. అయితే.. ‘ఢీ 12’ సీజన్‌కు అన్ని ఈక్వేషన్స్ మారిపోయాయి. ‘ఢీ’ అంటే వెంటనే అందరి మెదలో మెదిలేది ప్రదీప్ యాంకరింగ్. సుధీర్, రష్మీలు టీమ్ లీడర్లు అని అందరు ముందుగా ఫిక్సైపోయారు. కానీ ఈసారి మాత్రం ప్లాన్ మార్చేశారు ‘ఢీ’ షో నిర్వాహకులు.
యాంకర్ ప్రదీప్ (Twitter/Photo)
ఈ సీజన్లో ‘ఢీ’ ఛాంపియన్స్‌లో సుధీర్,రష్మీలు యాంకర్లుగా మారారు. ప్రత్యేకంగా పటాస్ రవి, వర్షిణిలు టీమ్ లీరడ్లుగా వచ్చారు. శ్రీముఖి బిగ్‌బాస్‌లో ప్రవేశించిన తర్వాత వర్షిణి..పటాస్ ప్రోగ్రామ్‌కు యాంకరింగ్ చేస్తూ వస్తుంది. అంతకు ముందు ‘ఢీ’ జోడికి వర్షిణి టీమ్ లీడర్‌గా వ్యవహరించింది. రవి, వర్షిణి టీమ్ లీడర్లుగా చేసి.. సుధీర్, రష్మీలను ఢీ ఛాంపియన్స్ యాంకర్లుగా చేశారు. ఐతే ఎవరున్నా లేకున్నా.. సుధీర్, రష్మీ మాత్రం ఉండాల్సిందే.
‘ఢీ’ యాంకర్ ప్రదీప్ (youtube/Photo)
వారిద్దరిని తీసేస్తే.. షో ఉన్న క్రేజ్ తగ్గుతుందని ఈసారి సుధీర్, రష్మీలను యాంకర్స్‌గా పెట్టారు. సో కావాలనే ఈ షో నుంచి ప్రదీప్ ను తప్పించారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఒకవేళ ప్రదీప్, రష్మీలు యాంకర్లుగా ఉంటే...సుధీర్ కామెడీ చేసే ఛాన్స్ మిస్ అవుతుంది. అదే రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ యాంకరింగ్ చేస్తే.. కామెడీ కూడా బాగా వర్కౌట్ అవుతుందని ‘ఢీ’ ప్రోగ్రామ్ నిర్వాహకులు భావిస్తున్నారు. అందుకే ప్రదీప్‌ను పక్కన పెట్టినట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.