Anchor Pradeep: యాంకర్ ప్రదీప్‌పై కుట్ర నిజమే.. రెండ్రోజుల ముందే న్యూస్ 18 కథనం..

యాంకర్ ప్రదీప్ (anchor Pradeep Machiraju)

Anchor Pradeep Machiraju: యాంకర్ ప్రదీప్‌పై కుట్ర జరుగుతుందంటూ రెండు రోజుల కింద న్యూస్ 18లోనే ఓ కథనం ప్రచురితం అయింది. ఇప్పుడు అదే నిజమైంది కూడా.

  • Share this:
యాంకర్ ప్రదీప్‌పై కుట్ర జరుగుతుందంటూ రెండు రోజుల కింద న్యూస్ 18లోనే ఓ కథనం ప్రచురితం అయింది. ఇప్పుడు అదే నిజమైంది కూడా. పంజాగుట్ట స్టేషన్‌లో తనపై 139 మంది అత్యాచారం చేరారంటూ ఓ యువతి చేసిన ఫిర్యాదు కొన్ని రోజులుగా పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అందులో చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఉండటం గమనార్హం. మరీ ముఖ్యంగా స్టార్ యాంకర్ ప్రదీప్ పేరు కూడా ఉండటం.. తననేం చేయొద్దని వేడుకున్నా కూడా అతడు అత్యాచారం చేసాడంటూ ఆ యువతి చెప్పడంతో సంచలనం అయింది.

యాంకర్ ప్రదీప్ (anchor Pradeep Machiraju)
యాంకర్ ప్రదీప్ (anchor Pradeep Machiraju)


వెంటనే దీనిపై బయటికి వచ్చిన ప్రదీప్.. తనకు ఎలాంటి పాపం తెలియదని.. అనవసరంగా తన ఇమేజ్ పాడు చేస్తున్నారంటూ వాపోయాడు. నిజానిజాలు తెలియకుండా తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్లపై లీగల్ యాక్షన్ తీసుకుంటానంటూ ఆయన వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత సీన్ అంతా మారిపోయింది. అసలు ఈ కేసుతో ప్రదీప్‌కు సంబంధం లేదని ఆ యువతి చెప్పడం సంచలనంగా మారింది.

ఇది కూడా చదవండి..
Anchor Pradeep: యాంకర్ ప్రదీప్‌పై నిజంగానే కుట్ర జరుగుతుందా..?

ప్రదీప్ ఒక్కడే కాదు నటుడు కృష్ణుడు, మరికొందరికి కూడా సంబంధం లేదంటూ తేలిపోయింది. ఇదే విషయంపై మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ఆ యువతిని డాలర్ బాబు అనే వ్యక్తి బలవంతం చేసి తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆమెతో అబద్దం ఆడించాడని చెప్పించాడు. మొత్తం 139 మంది పేర్లు అందులో చెప్పనప్పటికి కేవలం 30 శాతం మంది మాత్రమే ఈ కేసులో కీలక నింధితులు అంటూ ఆయన తెలిపారు. కావాలనే ప్రదీప్, కృష్ణుడు లాంటి వాళ్ల పేర్లు అందులో చేర్చారని యువతి తెలిపింది.

యాంకర్ ప్రదీప్ (anchor pradeep)
యాంకర్ ప్రదీప్ (anchor pradeep)


యాంకర్ ప్రదీప్‌కు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని.. అలాగే కవిత పీఏ సంతోష్ రావుకు కూడా ఇందులో ఎలాంటి ప్రమేయం లేదంటూ మందకృష్ణ మాదిగ పేర్కొన్నాడు. ఇక ఆ యువతి మాట్లాడుతూ తాను మోసపోయిన మాట వాస్తవమే.. చాలా మంది తనపై అఘాయిత్యం చేసిన మాట కూడా వాస్తవమే.. కానీ 139 మంది మాత్రం కాదని తెలిపింది.


అందులో కొందరి పేర్లు రెండుసార్లు రావడంతో పాటు కొందరికి సంబంధం లేకున్నా కూడా డాలర్ బాబు కావాలని తనతో వాళ్ల పేర్లు చెప్పించాడని తెలిపింది. తనతో పాటు కుటుంబ సభ్యులను కూడా చంపేస్తానంటూ బెదిరించడంతో అలా చెప్పాల్సి వచ్చిందని చెప్పింది ఆ యువతి. మొత్తానికి ప్రదీప్‌పై కుట్ర జరుగుతుందనే కోణం మాత్రం నిజమే అని నిరూపితమైంది.
Published by:Praveen Kumar Vadla
First published: