Pradeep Machiraju: పెళ్లి గురించి కుండబద్ధలు కొట్టిన ప్రదీప్.. ఇప్పట్లో ఆశలు పెట్టుకోవద్దు..

యాంకర్ ప్రదీప్ మాచిరాజు (Youtube/Photo)

Pradeep Machiraju: పెళ్లి గురించి మరోసారి తనదైన స్టయిల్లో సమాధానం ఇచ్చాడు ప్రదీప్. మీది ప్రేమ వివాహం కావాలని అనుకుంటున్నారా లేక పెద్దలు కుదిర్చిన వివాహం కావాలని అనుకుంటున్నారా అని ప్రశ్నిస్తే ప్రదీప్ నుంచి ఇంట్రెస్టింగ్ ఆన్సర్ వచ్చింది.

  • Share this:
    టాలీవుడ్‌లో స్టార్ యాంకర్‌గా దూసుకుపోతున్న ప్రదీప్ మాచిరాజు గురించి తెలియని వాళ్లు ఉండరంటే అందులో ఏ మాత్రం అతిశయోక్తి ఉండదు. బుల్లితెర ద్వారా పాపులర్ అయిన ప్రదీప్.. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. గతేడాది ఆడియెన్స్ ముందుకు రావాల్సిన ఈ మూవీ.. కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పటికే ఈ సినిమాలోని నీలి నీలి ఆకాశం సాంగ్ పాపులర్ కావడం సినిమాకు ప్లస్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే యాంకర్‌గా ఎంతో మంది అమ్మాయిల ఫేవరేట్‌గా మారిన ప్రదీప్... తన బ్యాచలర్‌ లైఫ్‌కు ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతాడనే దానిపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది.

    తాజాగా పెళ్లి గురించి మరోసారి తనదైన స్టయిల్లో సమాధానం ఇచ్చాడు ప్రదీప్. మీది ప్రేమ వివాహం కావాలని అనుకుంటున్నారా లేక పెద్దలు కుదిర్చిన వివాహం కావాలని అనుకుంటున్నారా అని ప్రశ్నిస్తే ప్రదీప్ నుంచి ఇంట్రెస్టింగ్ ఆన్సర్ వచ్చింది. తనకు లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ కావాలని ప్రదీప్ సమాధానం ఇచ్చాడు. ఇందుకు కారణం కూడా చెప్పాడు. ఒకవేళ ఎవరినైనా ప్రేమించినా.. పెద్దలను ఒప్పించాల్సి ఉంటుంది కాబట్టి లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని తెలిపాడు.

    ఇక 2021లో పెళ్లి చేసుకుంటారా అనే ప్రశ్నకు నో అనే సమాధానం చెప్పేశాడు ప్రదీప్. ఈ ఏడాది తన పెళ్లి ఉండదని కుండబద్ధలు కొట్టేశాడు. మీ పెళ్లి గురించి చాలామంది ఎదురుచూస్తున్నారని అంటే.. తమ పేరెంట్స్ కూడా ఇందుకోసం ఎదురుచూస్తున్నానని తెలిపాడు. మొత్తానికి పెళ్లి గురించి ప్రదీప్ చెప్పిన సమాధానాన్ని బట్టి.. ఈ విషయంలో అతడు ఫుల్ క్లారిటీతోనే ఉన్నట్టు అర్థమవుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published: