హోమ్ /వార్తలు /సినిమా /

Anchor Pradeep: యాంకర్ ప్రదీప్ ఆ రాజకీయ కుటుంబానికి అల్లుడిగా వెళ్ళనున్నాడా..?

Anchor Pradeep: యాంకర్ ప్రదీప్ ఆ రాజకీయ కుటుంబానికి అల్లుడిగా వెళ్ళనున్నాడా..?

Anchor Pradeep: తెలుగు బుల్లితెరపై ఉన్న యాంకర్స్‌లో ప్రదీప్ స్టార్. చాలా మంది మేల్ యాంకర్స్ ఉన్నా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ కుర్ర యాంకర్. ఈ మధ్యే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరోగా కూడా మారిపోయాడు..

ఇంకా చదవండి ...

  తెలుగు బుల్లితెరపై ఉన్న యాంకర్స్‌లో ప్రదీప్ స్టార్. చాలా మంది మేల్ యాంకర్స్ ఉన్నా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ కుర్ర యాంకర్. ఈ మధ్యే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరోగా కూడా మారిపోయాడు ఈ యాంకర్. ప్రదీప్ హోస్టుగా చేస్తున్నాడంటే నవ్వులకు ఢోకా ఉండదు. ఇక తెలుగు బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కూడా ప్రదీపే. ప్రతీ షోలో కూడా ఈయన పెళ్లి గురించి కామెంట్స్ వినిపిస్తుంటాయి. స్టార్ మా ఛానెల్ అయితే ఏకంగా ప్రదీప్ కోసం స్వయంవరమే ఏర్పాటు చేసింది. ఈయన కోసం ప్రత్యేకంగా పెళ్లిచూపులు ప్రోగ్రామ్ ఏర్పాటు చేసింది. అది ఫ్లాప్ అయింది.. అది వేరే విషయం అనుకోండి.. కానీ ఆయన కోసం ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసారు. ఇప్పుడు అప్పుడు అనకుండా ఎప్పుడూ ఈయన పెళ్లి టాపిక్ ట్రెండింగ్‌లోనే ఉంటుంది. నిన్నమొన్నటి సరెగమపా షోలో కూడా ప్రదీప్ పెళ్లి గురించి సెటైర్లు పడుతూనే ఉన్నాయి. దానికితోడు ఈయన నటించిన 30 రోజుల్లో ప్రేమించటం ఎలా సినిమా ప్రమోషన్స్‌కు వచ్చినపుడు కూడా పెళ్లి గురించి అడిగారు. ఆ మధ్య అలీతో సరదాగా షోకు వచ్చిన ప్రదీప్‌ను అలీ బాగా ఆడుకున్నాడు. నీకు గాళ్ ఫ్రెండ్ ఉందంట కదా అని అలీ అడిగితే సోనాలి బింద్రే అంటూ సమాధానమిచ్చాడు ప్రదీప్. దానికి నవ్విన ఆయన.. రియల్ నేమ్ చెప్పు అంటే ఎందుకు సర్ ఇప్పుడు పెళ్లై ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయ్యుంటుంది. ఈ షో చూస్తుంటుందని క్లారిటీ ఇచ్చాడు. అంటే ఈయనకు గతంలో లవర్ ఉందని ఒప్పుకున్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వెంటనే తన పెళ్లిపై అదిరిపోయే సెటైర్ వేసుకున్నాడు ఈ కుర్ర యాంకర్.

  యాంకర్ ప్రదీప్ (Anchor Pradeep)
  యాంకర్ ప్రదీప్ (Anchor Pradeep)

  పెళ్లెప్పుడు చేసుకుంటావంటే ఇప్పుడెందుకులే అంటూనే.. అమ్మో.. దానికి మనకు అస్సలు పడదుగా.. పెళ్లికి మనం చాలా దూరం అంటూ పంచ్ వేసాడు. దాంతో అక్కడున్న వాళ్లకు నవ్వు ఆగలేదు. మొత్తానికి ప్రతీసారి కూడా తన పెళ్లిపై వచ్చే కమెంట్స్‌ను విని విని చివరికి తనే జోకులు వేసుకోవడం మొదలుపెట్టాడు ప్రదీప్. యూ ట్యూబ్‌లో కూడా కొత్తగా రాస్తుంటారు.. చూసి నవ్వుకుంటానని చెప్పాడు ప్రదీప్.

  యాంకర్ ప్రదీప్ (Anchor Pradeep)
  యాంకర్ ప్రదీప్ (Anchor Pradeep)

  ఇప్పుడు మాత్రం అలా కాదు నిజంగానే ఈయన పెళ్లి కొడుకు కాబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఈయన ఓ ఇంటివాడు అవుతున్నట్లు వార్తలు అయితే నడుస్తున్నాయి. 33 ఏళ్ల ప్రదీప్ ఓ రాజకీయ కుటుంబానికి అల్లుడిగా వెళ్తున్నాడని తెలుస్తుంది. రాజకీయాలలో టీడీపీ తరఫున యాక్టివ్‌గా ఉన్న ఒక యువనేతతో ఈయన ఏడడుగులు నడవబోతున్నాడని వార్తలు అయితే బాగానే వస్తున్నాయి. రాయలసీమలోని యువ రాజకీయవేత్తతో ప్రదీప్ మూడు ముళ్ల బంధం పడబోతుందని టాక్స్ అయితే వినిపిస్తున్నాయి. అయితే ప్రదీప్ పెళ్లిపై ఇలాంటి వార్తలు రావడం కామన్ అయిపోయాయి. మరి దీనిపై ప్రదీప్ క్లారిటీ ఇస్తాడో లేదో చూడాలి.

  First published:

  Tags: Anchor pradeep, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు