యాంకర్ ప్రదీప్‌కు కరోనా వైరస్ తీసుకొచ్చిన తలనొప్పులు..

యాంకర్ ప్రదీప్ (Anchor Pradeep)

Anchor Pradeep: కొన్ని సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు చేసిన ప్రదీప్.. తొలిసారి హీరోగా చేసిన సినిమా 30 రోజుల్లో ప్రేమించటం ఎలా..?. అన్నీ బాగుండుంటే ఈ పాటికి సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేది.

  • Share this:
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అంటే ఇదేమరి. తెలుగు ఇండస్ట్రీలో ఈ సామెత చాలా మంది హీరోలకు వర్తిస్తుందిప్పుడు. అసలే హిట్లు లేక అల్లాడిపోతున్న ఇండస్ట్రీకి ఇప్పుడు కరోనా వైరస్ ధాటికి మరింత దిగజారిపోతుంది పరిస్థితి. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుంది ఇప్పుడు సిచ్చువేషన్. మరీ ముఖ్యంగా ప్రముఖ టీవీ యాంకర్ ప్రదీప్ మాచిరాజు పరిస్థితి అయితే దారుణం. ఇన్ని రోజులుగా ఈయన బుల్లితెరపై సందడి చేసాడు. అయితే ఈయన హీరోగా కూడా మారిపోయాడిప్పుడు. ఇప్పటికే కొన్ని సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు చేసిన ప్రదీప్.. తొలిసారి పూర్తిస్థాయి లీడ్ రోల్ చేసిన సినిమా 30 రోజుల్లో ప్రేమించటం ఎలా..?.

30 రోజుల్లో ప్రేమించడం ఎలా (Twitter/Photo)
30 రోజుల్లో ప్రేమించడం ఎలా (Twitter/Photo)


ఈ సినిమా మార్చ్ 25న విడుదల చేయాలనుకున్నారు. అన్నీ బాగుండుంటే ఈ పాటికి సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేది. కానీ ఏం చేస్తాం కరోనా వైరస్ వచ్చి అంతా నాశనం చేసింది. ఈ సినిమాను కొత్త దర్శకుడు మున్నా తెరకెక్కించాడు. సుకుమార్ శిష్యుడు ఈయన. ఈ సినిమాపై ప్రదీప్ భారీ ఆశలే పెట్టుకున్నాడు. దానికితోడు నీలినీలి ఆకాశం పాట కూడా సూపర్ డూపర్ హిట్ కావడంతో సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని నమ్మాడు కూడా. కానీ కరోనా దెబ్బకు ఆశలన్నీ అడియాశలైపోయాయి.

యాంకర్ ప్రదీప్ (Source: Twitter)
యాంకర్ ప్రదీప్ (Source: Twitter)


ఇప్పుడు మరో టెన్షన్ కూడా ప్రదీప్‌ను పట్టి పీడిస్తుంది. తన సినిమాతో పాటు చాలా పెద్ద పెద్ద సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. దాంతో మే, జూన్ అంతా వాళ్లే తీసుకెళ్తారు. ఒకవేళ అప్పుడు ధైర్యం చేసి వచ్చినా థియేటర్స్ దొరకవు.. ఉన్న థియేటర్స్ సినిమాకు సరిపోవు.. దాంతో ఇప్పట్లో ఈ చిత్రం విడుదల ఉండకపోవచ్చంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి బుల్లితెరపై అద్భుతాలు చేసిన ప్రదీప్.. వెండితెరపై మాత్రం తొలి అడుగులోనే షాక్ తినేసాడు. మరి మనోడి జాతకం ఎలా ఉండబోతుందో చూడాలిక.
Published by:Praveen Kumar Vadla
First published: