బుల్లితెరపై రష్మి గౌతమ్, సుడిగాలి సుధీర్ జంటకు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా ఏం చెప్పాలి..? వాళ్లిద్దరూ కలిస్తే బొమ్మ బ్లాక్‌బస్టర్ అంతే. అందుకే వాళ్లతోనే ఎక్కువగా షోలు కూడా చేస్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా యాంకర్ ప్రదీప్ చేసిన కామెంట్స్‌తో సుధీర్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. అదేంటి.. వాళ్ల ముగ్గురు మంచి స్నేహితులు కదా.. అలాంటిది రష్మిపై ప్రదీప్ ఏం కామెంట్ చేసాడబ్బా అనుకుంటున్నారా..? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. రష్మి గౌతమ్ షోలతో పాటు అప్పుడప్పుడూ సినిమాలు కూడా చేస్తుంటుంది.
అందులో భాగంగానే ప్రస్తుతం బొమ్మ బ్లాక్‌బస్టర్ అనే సినిమాకు కమిటైంది. గీతామాధురి భర్త నందు విజయ్ కృష్ణ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రష్మి గౌతమ్ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు. అందులో ఇది పోతురాజు గాడి పిల్ల వాణిగా నటిస్తుంది రష్మి. ఇదే పోస్టర్ విడుదల చేసారు చిత్రయూనిట్. దీనికి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. ఇదిలా ఉంటే ఈ పోస్టర్‌పై యాంకర్ ప్రదీప్ కామెంట్ చేసాడు.
ఇది పోతురాజు గాడి పిల్ల.. ఈ పిల్లకు ఏమైనా అయితే అతడే మోస్ట్ ఎఫెక్టెడ్ అంటూ అర్జున్ రెడ్డి డైలాగ్ కొట్టాడు. ఈ పిల్లను చూడ్డానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు అంటూ ప్రదీప్ కామెంట్ చేసాడు. ఇది కాస్తా వైరల్ అవుతుంది. పైగా కింద వస్తున్న కామెంట్స్ చూస్తుంటే పరిస్థితులు మారిపోతున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రదీప్ చేసిన కామెంట్‌పై సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు.
Ee pilla maa PothuRaju (@ActorNandu )gaadi Pilla....Ee pilla ki emaina aithe he’ll be the most affected...Understand 😂#BommaBlockbuster @vijaieebhava @rashmigautam27 pic.twitter.com/SvCr7YCyPU
— Pradeep Machiraju (@impradeepmachi) September 9, 2020
అందుకే కింద కామెంట్స్ చేస్తున్నారు. అన్నో.. ఇది పోతురాజు గాడి పిల్ల అయితే మరి మా సుధీర్ అన్న పరిస్థితి ఏంటి అంటూ కామెంట్ చేస్తున్నారు. సుధీర్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు రష్మి గౌతమ్. ఇప్పుడు పోతురాజు గాడి పిల్ల అంటూ పోస్టర్ విడుదల చేసే సరికి ఫ్యాన్స్ కాస్తా ఇలా రియాక్ట్ అవుతున్నారు. ఎంతమంది పోతురాజులు వచ్చినా ఈ పిల్ల మా సుధీర్ అన్నదే అంటూ కామెంట్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor pradeep, Anchor rashmi gautam, Sudigali sudheer, Telugu Cinema, Tollywood