యాంకర్ ప్రదీప్ రీ ఎంట్రీ ఇంకెప్పుడు.. కలవరిస్తున్న సుధీర్‌..

‘ఢీ’ యాంకర్ ప్రదీప్ (youtube/Photo)

భారీ పాపులారిటీ సంపాదించుకున్న షోలలో ‘ఢీ’ ఒకటి. అందులో డ్యాన్సర్ల స్టెప్పులు చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి. యంగ్ టాలెంటెడ్ అండ్ ఎనర్జిటిక్ డ్యాన్సర్లతో ఆ షో అమాంతం టీవీ రేటింగ్స్‌నే పెంచేసింది. 11 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకొని టాప్ గేర్‌లో దూసుకెళ్తున్న ఈ షో ఈ మధ్యే 12వ సీజన్‌లోకి అడుగు పెట్టింది.

 • Share this:
  భారీ పాపులారిటీ సంపాదించుకున్న షోలలో ‘ఢీ’ ఒకటి. అందులో డ్యాన్సర్ల స్టెప్పులు చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి. యంగ్ టాలెంటెడ్ అండ్ ఎనర్జిటిక్ డ్యాన్సర్లతో ఆ షో అమాంతం టీవీ రేటింగ్స్‌నే పెంచేసింది. 11 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకొని టాప్ గేర్‌లో దూసుకెళ్తున్న ఈ షో ఈ మధ్యే 12వ సీజన్‌లోకి అడుగు పెట్టింది. ఈ షోకు శేఖర్ మాస్టర్ ప్రధాన ఆకర్షణ. ఆయనతో పాటు హీరోయిన్లు ప్రియమణి, పూర్ణ గ్లామర్ షోకు పెద్ద ప్లస్. అంతకుముందు ఎలా ఉన్నా.. గత మూడు సీజన్లలో ఢీ స్థాయి పీక్ స్టేజీకి చేరింది. ఇక.. అన్నింటికంటే ముఖ్యంగా యాంకర్ పాత్రే ఈ షోకు అతి పెద్ద అస్త్రం. ఆ మూడు సీజన్లలో ప్రదీప్ మాచిరాజు యాంకర్‌గా వ్యవహరించాడు. అతడి టైమింగ్, యాంకరింగ్, స్పష్టమైన మాటతీరు, ప్రత్యేకమైన శారీరక విధానం, డ్రెస్సింగ్ స్టైల్.. ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. అదే సమయంలో ఆ షోలో సుడిగాలి సుధీర్ టీమ్ లీడర్‌గా ఉండటంతో వీరిద్దరి మధ్య పండే కామెడీ వల్ల కడుపు పట్టుకొని నవ్వాల్సి వస్తుందంటే ఆశ్చర్యపోనవసరం లేదు.

  సుధీర్‌ను బకరా చేసే విధానం, వారిద్దరు కలిసి రష్మీకి పంచ్ ఇచ్చే టైమింగ్, రష్మీ-ప్రదీప్ కలిసి సుధీర్‌ను ఏడిపించే సన్నివేశాలు.. డ్యాన్సులకంటేనూ ఎక్కువ స్థాయిలో దుమ్మురేపుతాయి. అయితే.. 12వ సీజన్ వచ్చే సరికి ప్రదీప్ స్థానంలో రష్మీ, సుధీర్ యాంకర్ అవతారం ఎత్తారు. టీమ్ లీడర్లుగా యాంకర్ రవి, వర్షిణి చేస్తున్నారు. ప్రదీప్ కాలికి దెబ్బ తగలడంతో అతడు షో నుంచి తప్పుకున్నాడు. ఇక, యాంకర్ రవి, సుధీర్ కెమిస్ట్రీతో రేటింగ్ సంపాదించుకుందామని నిర్వాహకులు భావించారు. కానీ.. వీరిద్దరి కెమిస్ట్రీ అంతగా వర్కౌట్ కావడం లేదని కొందరు నెట్టింట్లో కామెంట్ చేస్తున్నారు. ప్రదీప్ హావభావాలను రవి పలికించలేకపోతున్నాడని, అతడ్ని ఇమిటేట్ చేయాలని ప్రయత్నిస్తూ బోల్తా పడుతున్నాడని వ్యాఖ్యానిస్తున్నారు.

  వర్షిణి, రష్మీ కూడా తమ గ్లామర్‌తో షోకు ప్లస్ కాలేకపోతున్నారని జోరుగా చర్చ నడుస్తోంది. ప్రదీప్ మాచిరాజు మళ్లీ షోకు రీఎంట్రీ ఇస్తే పూర్వపు వైభవాన్ని సంపాదించుకునే అవకాశాలున్నాయని, లేకపోతే షో చప్పగానే సాగుతుందని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ప్రదీప్ లేని లోటు షో పై బాగానే పడుతోందని గుసగుసలాడుకుంటున్నారు. నిర్వాహకులను కూడా షో రేటింగ్ పడిపోతుండటం భయపెడుతోందని అంటున్నారు. అటు.. షో మధ్యలోనే ప్రదీప్‌తో మాట్లాడుతున్నట్లు, వీడియో కాల్ చేస్తున్నట్లు కలవరిస్తున్నాడు సుధీర్.
  Published by:Shravan Kumar Bommakanti
  First published: