Anchor Pradeep Machiraju: యాంకర్ ప్రదీప్ ఆశలపై నీళ్లు.. ఆ సినిమా ఓటిటిలో విడుదల..?

ప్రదీప్, అమృత అయ్యర్ Photo : Youtube

Anchor Pradeep Machiraju: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అంటే ఇదేమరి. తెలుగు ఇండస్ట్రీలో ఈ సామెత చాలా మంది హీరోలకు వర్తిస్తుందిప్పుడు. అసలే హిట్లు లేక అల్లాడిపోతున్న ఇండస్ట్రీకి ఇప్పుడు కరోనా వైరస్ ధాటికి మరింత దిగజారిపోతుంది..

  • Share this:
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అంటే ఇదేమరి. తెలుగు ఇండస్ట్రీలో ఈ సామెత చాలా మంది హీరోలకు వర్తిస్తుందిప్పుడు. అసలే హిట్లు లేక అల్లాడిపోతున్న ఇండస్ట్రీకి ఇప్పుడు కరోనా వైరస్ ధాటికి మరింత దిగజారిపోతుంది పరిస్థితి. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుంది ఇప్పుడు సిచ్చువేషన్. మరీ ముఖ్యంగా ప్రముఖ టీవీ యాంకర్ ప్రదీప్ మాచిరాజు పరిస్థితి అయితే దారుణం. ఇన్ని రోజులుగా ఈయన బుల్లితెరపై సందడి చేసాడు. అయితే ఈయన హీరోగా కూడా మారిపోయాడిప్పుడు. ఇప్పటికే కొన్ని సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు చేసిన ప్రదీప్.. తొలిసారి పూర్తిస్థాయి లీడ్ రోల్ చేసిన సినిమా 30 రోజుల్లో ప్రేమించటం ఎలా..?. ఈ సినిమా మార్చ్ 25న ఉగాది కానుకగా విడుదల చేయాలనుకున్నారు. అన్నీ బాగుండుంటే ఈ పాటికి సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేది. కానీ ఏం చేస్తాం కరోనా వైరస్ వచ్చి అంతా నాశనం చేసింది. ఈ సినిమాను కొత్త దర్శకుడు మున్నా తెరకెక్కించాడు. సుకుమార్ శిష్యుడు ఈయన. ఈ సినిమాపై ప్రదీప్ భారీ ఆశలే పెట్టుకున్నాడు.

 pradeep machiraju,pradeep machiraju twitter,pradeep machiraju 30 rojullo preminchadam ela movie in ott,30 rojullo preminchadam ela movie releasing in ott,30 rojullo preminchadam ela video songs,యాంకర్ ప్రదీప్,యాంకర్ ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించటం ఎలా ఓటిటి విడుదల
30 రోజుల్లో ప్రేమించడం ఎలా సాంగ్


దానికి తోడు నీలినీలి ఆకాశం పాట కూడా సూపర్ డూపర్ హిట్ కావడంతో సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని నమ్మాడు కూడా. కానీ కరోనా దెబ్బకు ఆశలన్నీ అడియాశలైపోయాయి. ఇప్పుడు మరో టెన్షన్ కూడా ప్రదీప్‌ను పట్టి పీడిస్తుంది. తన సినిమాతో పాటు చాలా పెద్ద పెద్ద సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. దాంతో థియేటర్స్ తెరిచిన తర్వాత అంతా వాళ్లే తీసుకెళ్తారు. ఒకవేళ అప్పుడు ధైర్యం చేసి వచ్చినా థియేటర్స్ దొరకవు.. ఉన్న థియేటర్స్ సినిమాకు సరిపోవు.. దాంతో ఇప్పట్లో ఈ చిత్రం ఓటిటి ప్లాట్ ఫామ్‌లో విడుదల చేయాలని చూస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

 pradeep machiraju,pradeep machiraju twitter,pradeep machiraju 30 rojullo preminchadam ela movie in ott,30 rojullo preminchadam ela movie releasing in ott,30 rojullo preminchadam ela video songs,యాంకర్ ప్రదీప్,యాంకర్ ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించటం ఎలా ఓటిటి విడుదల
30 రోజుల్లో ప్రేమించడం ఎలా (Twitter/Photo)


ఇప్పటికే ఈ విషయంపై అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహా సంస్థలు దర్శక నిర్మాతలతో రేట్ మాట్లాడుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ ఓటిటి విడుదలపై ప్రదీప్ మాత్రం అసంతృప్తితో ఉన్నాడని తెలుస్తుంది. ఎంతైనా హీరోగా నటించిన తొలి సినిమా కదా.. థియేటర్స్ కాకుండా నేరుగా ఆన్ లైన్ రిలీజ్ అంటే బాధగానే ఉంటుంది. అయితే మరీ ఎక్కువ రోజులు అలా నానబెడితే కూడా అసలుకే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు. థియేటర్స్ ఓపెన్ అయిన వెంటనే భారీ సినిమాలు క్యూ కట్టాయి. అవన్నీ దాటుకుని ప్రదీప్ సినిమా నిలబడటం అనేది చిన్న విషయం కాదు. అందుకే ఈయన కూడా సైలెంట్‌గా కాంప్రమైజ్ అయిపోతున్నాడని తెలుస్తుంది.
Published by:Praveen Kumar Vadla
First published: