ఊహించని పరిణామాలు జరిగినపుడు ఒక్కసారిగా అంతా షాక్ అయిపోతుంటారు. అలాంటి ఘటనే ఇప్పుడు జరిగింది. తాజాగా యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ప్రెస్ మీట్ జరిగింది. దర్శక నిర్మాతలతో పాటు సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ కూడా అంతా వచ్చారు. ఆ కార్యక్రమంలో అంతా ఒక్కొక్కరిగా మాట్లాడుతున్నారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని.. చాలా రోజుల తర్వాత వస్తున్నా కూడా కచ్చితంగా అందర్నీ అలరిస్తుందనే నమ్మకం ఉందని టీం చెప్తున్నారు. ఈ క్రమంలోనే మైక్ హీరో ప్రదీప్ చేతికి వచ్చింది. ఇప్పటి వరకు బుల్లితెరపై సత్తా చూపించిన ఈయన.. ఇప్పుడు వెండితెరపై సత్తా చూపించాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని.. నీలినీలి ఆకాశం పాట ఉన్నంత అందంగా సినిమా కూడా ఉంటుందని ప్రమోట్ చేసుకుంటున్నారు టీం. మరోవైపు హీరో ప్రదీప్ కూడా ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని నమ్మకంగా చెప్తున్నాడు. ఈ సినిమాలో అందమైన కథతో పాటు అద్భుతమైన ఎమోషన్స్ కూడా ఉన్నాయని చెప్పాడు ప్రదీప్. అందరూ అలా మాట్లాడుతుంటే.. వెనకాల దర్శకుడు మున్నా నిలబడి వింటున్నాడు. మైక్ హీరో చేతికి వచ్చింది. ప్రదీప్ కూడా తీసుకుని తన సినిమా గురించి చెప్తున్నాడు. అంతలోనే దర్శకుడు మున్నా కిందపడిపోయాడు. దాంతో పక్కనున్న వాళ్లే కాదు అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దర్శకుడు మున్నా పడిపోయిన సంగతి కూడా ప్రదీప్ గమనించలేదు.

యాంకర్ ప్రదీప్ దర్శకుడు మున్నా (Anchor Pradeep)
మున్నా కిందపడటంతో పక్కనే ఉన్న నిర్మాతతో పాటు మిగిలిన యూనిట్ కూడా వెంటనే స్పందించి స్టేజీపైనే కొన్ని నీళ్లు తీసుకొచ్చి ఇచ్చారు. చాలా సేపటి నుంచి నిలబడి ఉండటం.. లైట్ ఫోకస్ కూడా నేరుగా పడటంతో ఆ వేడికి కిందపడిపోయాడు మున్నా. స్టేజీ దిగిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ తీసుకుని మళ్లీ స్టేజీపైకి వచ్చాడు. తన సినిమా గురించి మాట్లాడాడు.
ఉన్నట్లుండి దర్శకుడు అలా పడిపోయేసరికి అంతా కంగారు పడ్డారు. అయితే ఏం ప్రమాదం లేదని.. కళ్లు తిరిగి పడిపోయాడని తెలుస్తుంది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం సూపర్ హిట్ అయింది. అదే సినిమాపై అంచనాలు కూడా పెంచేసింది.
Published by:Praveen Kumar Vadla
First published:January 23, 2021, 19:32 IST