యాంకర్ ప్రదీప్ హీరోగా మారి చేసిన సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? సుకుమార్ శిష్యుడు మున్నా తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 29న విడుదలైంది. పునర్జన్మల నేపథ్యంలో సాగే ఈ సినిమాకు తొలిరోజే నెగిటివ్ టాక్ వచ్చింది. హీరోగా ప్రదీప్ బాగానే చేసాడు కానీ కథ ఆయనకు సహకరించలేదు అంటూ పెదవి విరిచారు ప్రేక్షకులు. మరోవైపు హీరోయిన్ అమృత అయ్యర్ మాత్రం అద్భుతంగా నటించింది అంటూ ప్రశంసలు దక్కాయి. అలా తొలిరోజే ఈ సినిమా ఫ్యూచర్ ఏంటో తేలిపోయింది. తొలిరోజు తర్వాత సినిమా టాక్ ఎక్కడా వినిపించలేదు. కలెక్షన్స్ విషయంలో కూడా పెద్దగా చర్చ జరగలేదు. తొలిరోజు 3 కోట్ల వరకు గ్రాస్ వచ్చిందనే వార్తలు తప్ప.. ఆ తర్వాత మళ్లీ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా వసూళ్ల గురించి టాపిక్ రాలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు వారం రోజుల తర్వాత 14 కోట్లు గ్రాస్ వసూలు చేసిందంటూ పోస్టర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఇది చూసి నిజంగానే షాక్ అవుతున్నారు ఆడియన్స్. వామ్మో ప్రదీప్ సినిమా నిజంగానే 14 కోట్లు వసూలు చేసిందా.. కేవలం నీలినీలి ఆకాశం పాటతో వచ్చిన క్రేజ్ కారణంగానే ఇన్ని కోట్లు కలెక్ట్ చేసిందా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రదీప్, అమృత మధ్య కెమిస్ట్రీ బాగా పండిందని.. అదే సినిమా విజయానికి కూడా కారణం అంటూ చెప్పుకొచ్చారు దర్శక నిర్మాతలు. యాంకర్‌గా ప్రదీప్‌కు బుల్లితెరపై ఉన్న క్రేజ్ సినిమా కోసం బాగా యూజ్ అయిందని దర్శకుడు మున్నా చెప్పాడు.
ఏదేమైనా కూడా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాకు 14 కోట్ల గ్రాస్ వచ్చిందనే విషయం మాత్రం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది. 14 కోట్లు గ్రాస్ అంటే దాదాపు 8 కోట్ల వరకు షేర్ అన్నమాట. అంటే 4.4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రానికి 8 కోట్ల వరకు వసూళ్లు వచ్చాయని చెప్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ లెక్కన తొలి సినిమాతో హీరోగా ప్రదీప్ సక్సెస్ అయినట్లే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor pradeep, Telugu Cinema, Tollywood