టీవీ యాంకర్‌ ప్రదీప్ మాచిరాజుపై పోలీసులకు ఫిర్యాదు..

యాంకర్ ప్రదీప్ (Anchor Pradeep)

టీవీ యాంకర్, నటుడు ప్రదీప్ మాచిరాజుపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఓ ఫిర్యాదు నమోదైంది.

  • Share this:
    టీవీ యాంకర్, నటుడు ప్రదీప్ మాచిరాజుపై బంజారాహిల్స్ పోలీసులకు ఓ దర్శకుడు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ నిబంధనలకు విరుద్ధంగా గతంలో రెండు రోజుల జైలు శిక్ష అనుభవించిన ప్రదీప్‌ ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నారని, ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధమని ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో యువ దర్శకుడు ఫిర్యాదు చేశాడు. మేడ్చల్‌ జిల్లా కీసర సమీపంలోని రాంపల్లికి చెందిన సునిశిత్‌ ఈ మేరకు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాలో ప్రదీప్‌ మాచిరాజు ప్రధాన పాత్రలో నటిస్తున్నారని, సినిమా షూటింగ్ ఆపాలని ఆ మేరకు ఫిర్యాదు చేశానని తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  గతంలో ప్రదీప్ ఓ అమ్మాయిని వేధించిన ఘటనలో రెండు రోజులు జైలుకు వెళ్లారని.. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ రూల్స్‌కు వ్యతిరేకంగా ప్రదీప్‌ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారని ఇది రూల్స్‌‌ను అతిక్రమించడమేనని ఆరోపించాడు. అంతేకాదు ఈ సినిమా డైరెక్టర్ కూడా ప్రదీప్‌తో పాటు బోర్డ్ నిబంధనలను అతిక్రమించారని తెలిపాడు.

    ప్రస్తుతం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా షూటింగ్‌ జరుగుతోందన్నారు. నిబందనలకు వ్యతిరేకంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ  సినిమాను వెంటనే ఆపాలంటూ ఆదేశాలు జారీ చేయాలని ఫిర్యాదులో కోరాడు. కాగా ప్రదీప్ గతంలోనూ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరుక్కుని, ఆ తర్వాత కౌన్సిలింగ్ తీసుకున్న సంగతి తెలిసిందే. అది అలా ఉంటే ప్రదీప్ నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ నుండి ఓ సాంగ్ విడుదలై య్యూటూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
    Published by:Suresh Rachamalla
    First published: