ఒక్క పాటతో సినిమా సగం బడ్జెట్ రికవరి.. ప్రదీపా.. మజాకా..

ప్రదీప్, అమృత అయ్యర్ Photo : Youtube

Anchor Pradeep : యాంకర్‌గా ఉంటూనే కొన్ని సినిమాల్లో నటించిన ప్రదీప్.. సోలో హీరోగా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే..

  • Share this:
    యాంకర్ ప్రదీప్ తెలుగు టీవీ తెరపై తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అనవసరమైన అసభ్యత లేకుండా కొంటె మాటలతో తెలుగవారిని అలరిస్తోన్న ప్రదీప్ ఆ మధ్య హీరోగా ఓ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. గతంలో యాంకర్‌గా ఉంటూనే కొన్ని సినిమాల్లో నటించిన ప్రదీప్.. సోలో హీరోగా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమా చేసాడు. కరోనా లేకపోతే.. ఈ పాటికి ప్రదీప్ హీరోగా నటించిన ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలై ఉండేది. ఈ చిత్రాన్ని సుకుమార్ ద‌గ్గ‌ర కొన్ని సినిమాల‌కు దర్శకత్వ శాఖలో పని చేసిన మున్నా అనే కొత్త కుర్రాడు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. ఎస్వీ ప్రొడక్షన్ బ్యానర్‌లో ఎస్వీ బాబు నిర్మించాడు. ఇక ఈ సినిమాలోని ‘నీలీ నీలీ ఆకాశం’ పాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పాట.. అందులోని లిరిక్స్ ఎంతగా ఆకట్టుకున్నాయంటే.. చంద్రబోస్ ఇరగదీశాడు. దీంతో ఆ పాట విడుదలైన రోజు నుండి యూట్యూబ్‌లో దుమ్ములేపుతోంది. ఇప్పటికే రికార్డు స్ఠాయిలో వ్యూస్ దక్కించుకున్న ఈ పాట.. తాజాగా యూట్యూబ్‌లో 200 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది.

    అన్ని పూర్తి చేసుకుని.. విడుదలకు రెడీ అయ్యి ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టిన సమయంలో కరోనా కారణంగా థియేటర్లు మూతబడి విడుదలకు నోచుకోలేదు ఈ సినిమా. అయితే ఆమధ్య ఓటీటీ ద్వారా విడుదల అయ్యే అవకాశం ఉందని వార్తలు వచ్చిన.. ప్రదీప్ మొదటి సినిమా కావడంతో థియేటర్ లోనే విడుదల చేయాలని భావిస్తున్నారట చిత్రబృందం. అది అలా ఉంటే.. ఈ చిత్రంలోని నీలి నీలి ఆకాశం పాట గత ఆరు ఏడు నెలలుగా ట్రెండ్ అవుతూనే ఉంది. ఇప్పటికే 200 మిలియన్ వ్యూస్ ను దక్కించుకున్న ఈ పాటతో వచ్చిన ఆదాయంతో సినిమా సగం బడ్జెట్ రికవరీ అయ్యి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఆ పాటతో వచ్చిన ఆదాయం సినిమా బడ్జెట్ లో సగానికి ఎక్కువగా ఉంటుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. యూట్యూబ్‌తో పాటు ఇతర వీడియో స్ట్రీమింగ్ యాప్స్, ఆడియో స్ట్రీమింగ్ యాప్స్ ద్వారా కోటికి పైగా ఆదాయం వచ్చి ఉంటుందని అంటున్నారు. అయితే ఒక్క పాటతో ఈ స్థాయి ఆదాయం రావడం రికార్డ్ కాకపోవచ్చు. కానీ ఓ చిన్న బడ్జెట్ సినిమాకు అందులోను ఓ పాటకు ఈ స్థాయిలో ఆదాయం రావడం అనేది ఖచ్చితంగా చర్చించాల్సిందే. ఇక ఆ పాట తెచ్చిన క్రేజ్‌తో ఈ సినిమాకు థియేట్రికల్ రైట్స్, మరోవైపు ఓటీటీ, శాటిలైట్ రైట్స్ కు కూడా భారీ డిమాండ్ వచ్చిందట. దీంతో ప్రదీప్ ఫస్ట్ సినిమా ఈ కరోనా సమయంలో కూడా నిర్మాతలకు మంచి లాభాల్నీ తీసుకురానుందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.
    Published by:Suresh Rachamalla
    First published: