‘ఢీ’ షో నుంచి తప్పుకోవడంపై యాంకర్ ప్రదీప్ క్లారిటీ..

యాంకర్ ప్రదీప్

యాంకర్ ప్రదీప్.. ఈ పేరు వింటే తెలుగు స్మాల్ స్క్రీన్ ఎగిరి గంతేస్తుంది. తన గాత్రంతో, సమయస్ఫూర్తితో టీవీ యాంకర్‌గా రాణిస్తూ ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్నాడు ప్రదీప్. గత కొన్ని రోజులుగా తాను ఎందుకు టీవీషోలకు దూరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

  • Share this:
    యాంకర్ ప్రదీప్.. ఈ పేరు వింటే తెలుగు స్మాల్ స్క్రీన్ ఎగిరి గంతేస్తుంది. తన గాత్రంతో, సమయస్ఫూర్తితో టీవీ యాంకర్‌గా రాణిస్తూ ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్నాడు ప్రదీప్.  తెలుగులో ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఢీ’ షో‌ను తనదైన యాంకరింగ్‌తో రక్తి కట్టించాడు.  తెలుగులో  ‘ఢీ’ బెస్ట్ డాన్స్ షోగా గుర్తింపు పొందింది. ఐతే.. ఈ డాన్స్ షో లో కేవలం డాన్సే కాకుండా.. సుధీర్, రష్మీ గౌతమ్ రొమాంటిక్ కామెడీ.. ప్రదీప్ మాచిరాజు యాంకరింగ్ ఈ షోకు స్పెషల్ అస్సెట్‌గా నిలిచాయి. పైగా ఉన్నట్లుండి ఆయన మూడేళ్లుగా చేస్తున్న ఢీ జోడీ నుంచి కూడా తప్పుకున్నాడు. దాంతో అభిమానులు షాక్ అయ్యారు. ఈయన రెమ్యునరేషన్ ఎక్కువగా అడగడం వల్లే తప్పించారనే ప్రచారం కూడా జరిగింది. అందుకే ఆయన్ని కాదని.. రవిని రంగంలోకి దించారనే వార్తలు కొన్ని రోజులుగా వచ్చాయి. తాజాగా ప్రదీప్.. తాను ఈ షో నుండి ఎందుకు తప్పుకున్నాడనే విషయమై క్లారిటీ ఇచ్చాడు.    తాను ఒక షో చేస్తోన్న సమయంలో తన కాలికి తీవ్ర గాయమైందని చెప్పాడు. ఈ సందర్భంగా తనను ఎక్కువగా నిలబడద్దని  డాక్టర్లు తనకు సూచనలు ఇచ్చారని చెప్పుకొచ్చాడు. అంతేకాదు కొంత కాలం ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయకుండా రెస్ట్ తీసుకోమని చెప్పారు. అందుకే ఈ షో నుండి తప్పుకున్నట్టు చెప్పుకొచ్చాడు. తన కాలికి గాయం తప్ప తనకు  ఇంకా ఏమి కాలేదని క్లారిటీ ఇచ్చాడు. కాలి గాయం పూర్తిగా తగ్గిన తర్వాత మళ్లీ యదావిధిగా షోలు చేస్తానని చెప్పుకొచ్చాడు. మొత్తానికి ప్రదీప్ తను ఎందుకు టీవీ షోలు చేయడం లేదని క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
    First published: