Pradeep: దయచేసి నాపై తప్పుడు ఆరోపణలు చేయకండి.. యాంకర్ ప్రదీప్ వీడియో సందేశం..

యాంకర్ ప్రదీప్ మాచిరాజు (Youtube/Photo)

Pradeep Machiraju | హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఓ యువతి పెట్టిన కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో తన పేరుతో వివిధ మాధ్యమాల్లో వస్తోన్న కథనాలపై యాంకర్ ప్రదీప్ మాచిరాజు యూట్యూబ్ వేదికగా స్పందించాడు.

  • Share this:
    Pradeep Machiraju | హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఓ యువతి పెట్టిన కేసు సంచలనంగా మారింది. తనపై ఒకరు ఇద్దరు కాదు ఏకంగా 139 మంది అత్యాచారం చేసారని.. 5000 వేల సార్లు తనను బలవంతంగా అనుభవించారని ఈమె పెట్టిన కేసు పోలీసులకు కూడా సవాల్‌గా మారింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని 25 ఏళ్ల యువతి ఈ కేసు పెట్టింది. తనపై కొన్నేళ్లుగా ఈ అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పడం ఆసక్తిగా మారింది. పదేళ్లుగా తనను వేధిస్తున్నారని.. తనపై 139 మంది అత్యాచారం చేశారని తనే స్వయంగా కంప్లైంట్ ఇవ్వడంతో ఈ కేసుపై పోలీసులు కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కేసులో యువతి ఇచ్చిన ఫిర్యాదుతో 113 పేజీలతో ఎఫ్ఐఆర్‌ నమోదు చేశారు పంజాగుట్టు పోలీసులు. ఈ లిస్టులో యాంకర్ ప్రదీప్ మాచిరాజు పేరు ఉండటం సంచలనంగా మారింది.తాజాగా ఈ ఇష్యూలో తన పేరు రావడం.. తనను సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు గురిచేయడంపై యాంకర్ ప్రదీప్ మాచిరాజు యూట్యూబ్ వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేసాడు.

    ఇందులో యాంకర్ ప్రదీప్ మాట్లాడుతూ.. రెండు మూడు రోజులుగా వివిధ మాధ్యమాల్లో రేప్ కేసులో తన పేరును వాడుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసాడు. తన పేరు కనపడగానే సెన్సేషనల్ కోసమే కొంత మంది ఇది నిజమా కాదా అని తెలుసుకోకుండా.. తనను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంపై ఆవేదన వ్యక్తం చేసాడు. తన కుటుంబంలోని ఆడవాళ్లపై సామాజిక మాధ్యమాల్లో అనరాని మాటలు అన్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఒక వ్యక్తికి న్యాయం చేయడం కరెక్టే. అలా అని ఈ విషయంలో ఏం సంబంధం లేని తన పేరును ఇరికించడం దారుణమన్నారు. వ్యూస్ కోసం తన పేరును వాడుకోవడం దారుణమన్నాడు. నిజం ఎప్పటికైనా బయటకు వస్తోంది. అప్పటి వరకు వెయిట్ చేయకుండా తనపై ఈ విధంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారన్నారు.  వివిధ మాధ్యమాల్లో తనపై జరుగుతోన్న ట్రోల్స్ పై తన కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదనకు గురవుతున్నారు. వాళ్లకు ఏమైనా జరిగితే.. ఎవరు బాధ్యత తీసుకుంటారన్నారు.  గతంలో తనకు ఒంట్లో బాగాలేకపోతే.. తనకేదో అంతులేని రోగం ఉన్నట్టు పుకార్టు పుట్టించారు. ఈ విషయమై అప్పట్లో క్లారిటీ ఇచ్చారు. మొత్తంగా తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ప్రదీప్ యూట్యూబ్ వేదికగా వెల్లడించాడు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: