యాంకర్ ప్రదీప్ పై భారీ కుట్ర...ఆ కేసు వెనుక ఎవరున్నారంటే...

Pradeep Machiraju: మొన్న ఉదయ్ కిరణ్(uday Kiran), నిన్న వరుణ్ సందేశ్(varun sandesh), నేడు యాంకర్ ప్రదీప్(Pradeep Machiraju) ఇలా ఒకే సామాజిక వర్గానికి చెందిన హీరోలపై భారీ కుట్ర జరుగుతుందా అనే డౌట్ ఇండస్ట్రీలో మార్మొగుతోంది.

news18-telugu
Updated: February 3, 2020, 6:41 PM IST
యాంకర్ ప్రదీప్ పై భారీ కుట్ర...ఆ కేసు వెనుక ఎవరున్నారంటే...
యాంకర్ ప్రదీప్ ఫైల్ ఫోటో
  • Share this:
మొన్న ఉదయ్ కిరణ్, నిన్న వరుణ్ సందేశ్, నేడు యాంకర్ ప్రదీప్( Pradeep Machiraju) ఇలా ఒకే సామాజిక వర్గానికి చెందిన హీరోలపై భారీ కుట్ర జరుగుతుందా అనే డౌట్ ఇండస్ట్రీలో మార్మొగుతోంది. బుల్లితెర నుంచి వెండితెరపైకి ఎంట్రీ ఇస్తున్న యాంకర్ ప్రదీప్‌ మాచిరాజుపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేయడం వెనుక భారీ కుట్ర దాగి ఉందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం ప్రదీప్(Pradeep Machiraju) హీరోగా ౩౦ రోజుల్లో ప్రేమించడం ఎలా  అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ నిబంధనలకు విరుద్ధంగా రెండు రోజుల జైలు శిక్ష అనుభవించిన ప్రదీప్‌ ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నారని, ఇది నిబంధనలకి విరుద్దమని, ఈ సినిమా షూటింగ్ వెంటనే ఆపేయాలని యాంకర్ ప్రదీప్‌ పై మేడ్చల్‌ జిల్లా కీసర సమీపంలోని రాంపల్లికి చెందిన శ్రీరామోజు సునిశిత్‌ అనే దర్శకుడు పోలీస్ స్టేషన్ లో దాఖలు చేశాడు. మొదట ఈ కేసుపై అంతా లైట్ తీసుకున్నప్పటికీ, యాంకర్ ప్రదీప్ కెరీర్‌ను దెబ్బ తీసేందుకు అదృశ్య హస్తాలు పనిచేస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. బుల్లితెర నుంచి వెండితెరపైకి ఎంట్రీ ఇస్తున్న యాంకర్ ప్రదీప్ సినిమా తాజాగా యూట్యూబ్ లో సంచలనంగా మారింది. ఆ సినిమాలోని నీలి నీలి ఆకాశం(Neeli Neeli Aakasam) పాట ప్రస్తుతం 60 లక్షల వ్యూస్ తో నెంబర్ వన్ ట్రెండింగ్ గా మారింది. దీంతో అతడు సినిమా ఎంట్రీ చాలా గ్రాండ్ గా జరిగేందుకు అవకాశం ఏర్పడింది. అయితే ప్రదీప్ మాచిరాజు ఎదుగుదలపై కన్నేసిన కొన్ని శక్తులు ఇండస్ట్రీలో కొత్త వారికి చాన్సులు ఇస్తే, తర్వాత ఆ రెండు సామాజిక వర్గాల చేతుల నుంచి ఇండస్ట్రీ పట్టు కోల్పుతుందని భావించి, కొత్త సామాజిక వర్గాల నుంచి ఇండస్ట్రీకి వచ్చిన వారిని మొగ్గలోనే తుంచేయాలనే కుట్ర జరుగుతోందని టాక్ వినిపిస్తోంది.

అయితే ఇందుకు ఉదాహరణలు లేకపోలేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుంచి ఒకే సామాజిక వర్గం నుంచి అగ్రహీరోలు టాలివుడ్ పై పెత్తనం చేశారు. బడా స్టూడియోలు, నిర్మాణ సంస్థలు అన్నీ కూడా ఆ సామాజిక వర్గానివే కావడం గమనార్హం. ఆ తర్వాత ఇండస్ట్రీలో పెద్ద హీరోలుగా ఎదిగిన కృష్ణ, శోభన్ బాబు కూడా ఆ సామాజిక వర్గానికి చెందినవారే, వారి తర్వాత, వారసులుగా పేరొందిన బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు ఇలా చెప్పుకుంటూ పోతే మెగాస్టార్ చిరంజీవి అతని ఫ్యామిలీ మినహా దాదాపు పెద్ద హీరోలందరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం విశేషం.

కాగా యాంకర్ ప్రదీప్ తరహాలోనే గతంంలో అదే సామాజిక వర్గానికి చెందిన ఉదయ్ కిరణ్ స్వశక్తితో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. అయితే కొన్ని శక్తులు అతడి పతనానికి కారణమై, చివరకు విషాదాంతంగా ముగిసే దాకా నిద్రపోలేదు. అయితే ఇదే తరహాలో వరుణ్ సందేశ్ కు సైతం పెద్ద సినిమాల్లో ఆ అవకాశాలు వచ్చినట్లే వచ్చి, పెద్ద హీరోల వారసులు తన్నుకుపోయారు. అయితే ఇదే తరహాలో ప్రదీప్ మాచిరాజును సైతం మొగ్గలోనే తుంచేలా కేసులు పెడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే టాలెంట్ ఉన్న వ్యక్తిని ఎవ్వరూ అడ్డుకోలేరని అతడి ఫ్యాన్స్ నెట్టింట సపోర్ట్ గా నిలబడుతున్నారు.

First published: February 3, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు