Anchor Pradeep 30 రోజుల్లో ప్రేమించడం ఎలా.. ఎలా ఉంది.. ట్విట్టర్ రివ్యూ..

Pradeep 30 Rojullo Preminchadam Ela Twitter review

Anchor Pradeep | 30Rojullo Preminchadam Ela : యాంకర్ ప్రదీప్‌ను తెలుగువారికి ముఖ్యంగా తెలుగు టీవీ షోలను చూసేవారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర లేదు.

  • Share this:
    యాంకర్ ప్రదీప్‌ను తెలుగువారికి ముఖ్యంగా తెలుగు టీవీ షోలను చూసేవారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర లేదు. తనదైన స్టైల్లో యాంకరింగ్ చేస్తూ చురకైన పంచులతో తన మాటల్లో ఎక్కడా అశ్లీలత లేకుండా చూసుకుంటూ తెలుగులో టాప్ షోలకు వ్యాఖ్యాతగా అదరగొడుతున్నాడు. తెలుగు టీవీ తెరపై తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రదీప్.. తాజాగా 30 రోజుల్లో ప్రేమించండం ఎలా అనే సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రదీప్ గతంలో యాంకర్‌గా ఉంటూనే కొన్ని సినిమాల్లో నటించినా ఈసారి.. సోలో హీరోగా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో వస్తున్నాడు. కరోనా లేకపోతే.. ఈ పాటికి ప్రదీప్ హీరోగా నటించిన ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలై ఉండేది. ఈ చిత్రాన్ని సుకుమార్ ద‌గ్గ‌ర కొన్ని సినిమాల‌కు దర్శకత్వ శాఖలో పని చేసిన మున్నా అనే కొత్త కుర్రాడు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. ఎస్వీ ప్రొడక్షన్ బ్యానర్‌లో ఎస్వీ బాబు నిర్మించాడు. హీరోయిన్‌గా అమృత అయ్యర్ అనే తమిళ భామ నటించింది. ఇక ఈ సినిమాలోని ‘నీలీ నీలీ ఆకాశం’ పాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పాట.. అందులోని లిరిక్స్ ఎంతగా ఆకట్టుకున్నాయంటే.. చంద్రబోస్ ఇరగదీశాడు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ కేకపెట్టించాడు. దీంతో ఆ పాట విడుదలైన రోజు నుండి యూట్యూబ్‌లో దుమ్ములేపుతోంది. ఇప్పటికే రికార్డు స్ఠాయిలో వ్యూస్ దక్కించుకున్న ఈ పాట.. తాజాగా యూట్యూబ్‌లో 223 మిలియన్ వ్యూస్‌‌తో దూసుకుపోతోంది.

    ఇక కరోనా కారణంగా థియేటర్లు మూతబడి విడుదలకు నోచుకోలేకపోయిన ఈ సినిమా లాక్ డౌన్‌లో సడలింపులు ఇవ్వడంతో విడుదలకు రెడీ అయ్యింది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ఈరోజు విడుదలవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉంది.. కథ ఏమాత్రం ప్రేక్షకులను రంజింపజేస్తోంది. ప్రదీప్ నటన ఎలా ఉంది. మొదలగు అంశాలను ఇప్పటికే ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. అవేంటో ఈ సినిమాపై వారి అభిప్రాయాలు ఏంటో ఓ సారి చూద్దాం..






    ఈ చిత్రంలోని నీలి నీలి ఆకాశం పాట గత ఆరు ఏడు నెలలుగా ట్రెండ్ అవుతూనే ఉంది. ఇప్పటికే 223 మిలియన్ వ్యూస్ ను దక్కించుకున్న ఈ పాటతో వచ్చిన ఆదాయంతో సినిమా సగం బడ్జెట్ రికవరీ అయ్యి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఆ పాటతో వచ్చిన ఆదాయం సినిమా బడ్జెట్ లో సగానికి ఎక్కువగా ఉంటుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. యూట్యూబ్‌తో పాటు ఇతర వీడియో స్ట్రీమింగ్ యాప్స్, ఆడియో స్ట్రీమింగ్ యాప్స్ ద్వారా కోటికి పైగా ఆదాయం వచ్చి ఉంటుందని అంటున్నారు. అయితే ఒక్క పాటతో ఈ స్థాయి ఆదాయం రావడం రికార్డ్ కాకపోవచ్చు. కానీ ఓ చిన్న బడ్జెట్ సినిమాకు అందులోను ఓ పాటకు ఈ స్థాయిలో ఆదాయం రావడం అనేది ఖచ్చితంగా విశేషమే.
    Published by:Suresh Rachamalla
    First published: