Deepthi Sunaina- Shanmukh: డబ్స్మాష్ వీడియోల ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న దీప్తి సునయన.. ఆ తరువాత బిగ్‌బాస్‌లోకి వెళ్లి మరింత క్రేజ్‌ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం షార్ట్ ఫిలింస్, ఆల్బమ్‌లతో బిజీగా గడుపుతున్నారు. ఇక దీప్తి వ్యక్తిగత జీవితంలోకి వెళితే.. గత కొన్నేళ్లుగా ఈమె, తన తోటి యూట్యూబర్ షణ్ముక్‌తో ప్రేమలో ఉంది. డబ్‌స్మాష్‌లు చేసే సమయం నుంచే వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం మొదలైంది. ఆ తరువాత ఈ ఇద్దరు కలిసి డ్యాన్స్‌లు, వీడియోలు చేసేవారు. ఇలా వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. అంతేకాదు ఆ ప్రేమకు గుర్తుగా ఇద్దరు చేతులపై టాటూలు కూడా వేసుకున్నారు. కాగా దీప్తి బిగ్‌బాస్‌లోకి వెళ్లిన సమయంలో వీరిద్దరిపై ఎన్నో మీమ్‌లు వచ్చాయి. అయితే హౌజ్‌లోకి వెళ్లిన తరువాత దీప్తి, నటుడు తనీష్‌తో క్లోజ్‌గా ఉండటంతో.. షణ్ముక్ హర్ట్ అయ్యాడని టాక్ నడిచింది. అంతేకాదు బిగ్‌బాస్ నుంచి వచ్చిన తరువాత వీరిద్దరు పెద్దగా కలవకపోవడంతో.. ఆ పుకార్లకు మరింత బలం చేకూరినట్లైంది.
అయితే ఆ తరువాత దీప్తితో తన రిలేషన్‌పై తనీష్ క్లారిటీ ఇచ్చారు. ఆమె తనకు చెల్లెలులాంటిదని అన్నారు. అదంతా పక్కనపెడితే.. గత కొన్నేళ్లుగా దీప్తి, షణ్ముక్ మాత్రం ముందుగా ఉన్నంత క్లోజ్‌గా కనిపించలేదు. దీంతో వీరు విడిపోయారనే టాక్ కూడా నడిచింది. అయితే ఆ మధ్యన తన వెబ్ సిరీస్ సాఫ్ట్వేర్ డెవలపర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన షణ్ముక్, దీప్తితో రిలేషన్‌పై క్లారిటీని ఇచ్చారు. తన చేతి మీద ఉన్న టాటూను చూపించి, ఇది పోయే వరకు తన ప్రేమ పోదని అన్నాడు. దీంతో తామిద్దరం ఇంకా ప్రేమలో ఉన్నామని చెప్పకనే చెప్పాడు. ఆ తరువాత కూడా ఓ ఆల్బమ్ సాంగ్‌లో మెరిశారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ ఇద్దరు స్టార్‌మాలో ప్రసారం అవుతున్న 100పర్సెంట్ లవ్ అనే ఓ షోలో పాల్గొన్నారు. ఇందులో రియల్ కపుల్‌గా ఈ ఇద్దరు సందడి చేస్తున్నారు. కాగా ఈ షో రెండో భాగం ఈ ఆదివారం ప్రసారం కానుండగా.. దానికి సంబంధించిన ఓ ప్రోమోను విడుదల చేశారు. అందులో వ్యాఖ్యాత ఓంకార్ దీప్తి గురించి మాట్లాడుతూ.. షణ్ముక్ ఏం లేని పరిస్థితి నుంచి ఇక్కడవరకు వచ్చే వరకు నువ్వు తన వెంట ఉన్నావు. నువ్వు నిజంగా గ్రేట్ అంటూ ప్రశసంలు కురిపించారు. ఇక ఈ షోలో వీరిద్దరు డీజేలోని సిటీమార్ పాటకు డ్యాన్స్ వేయడంతో పాటు టాస్క్‌ల్లోనూ పాల్గొననున్నారు.