Anchor Manjusha : చక్కటి చిరునవ్వుతో, అందమైన మోముతో టీవీల్లో సందడి చేసే యాంకర్ మంజూష అంటే యూత్, మహిళ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగు సినిమా సెలబ్రిటీ ఇంటర్వ్యూలు, ఆడియో రిలీజ్ ఫంక్షన్స్‌తో పాటు వివిధ టాక్ షోస్ ద్వారా అదరగొడుతూ తెలుగు వారికి దగ్గరైంది. అయితే ఈ యాంకరింగ్ కంటే ముందు మంజూష కొన్ని సినిమాల్లో నటించింది. వాటిలో ముఖ్యంగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'రాఖీ'ముఖ్యమైనది. ఆ సినిమాలో ఎన్టీఆర్ చెల్లెలుగా నటించిన మంజూష కన్నీరు పెట్టించేసింది. రాఖీలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అత్త పెడుతున్న భాదల్నీ తట్టుకుంటూ.. తాను చేసిన నటన ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత అడపా దడపా.. కొన్ని సినిమాల్లో నటించినా.. యాంకర్‌గానే మంచి పేరు తెచ్చుకుంది మంజూష. అది అలా ఉంటే మంజూష తన డ్యాన్స్ మూవ్స్‌తో సోషల్ మీడియాలో అదరగొడుతోంది. ఈ ముద్దుగుమ్మ టిక్ టాక్ వీడియోలు చేస్తుంటుంది. అందులో భాగంగా ప్రభాస్ సాహో సాంగ్‌కు, సాయి తేజ్ ప్రతిరోజు పండగే ఓ బావ పాటకు అదిరిపోయే స్టెప్స్ వేస్తూ కేక పెట్టిస్తోంది. ఆ వీడియోలను మంజూష తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్స్‌తో పాటు ఆమె అభిమానులు ఆ వీడియోపై తెగ కామెంట్స్ పెడుతున్నారు. మంజూష అదరగొట్టిందని, సూపర్‌గా డ్యాన్స్ చేస్తుందని కామెంట్స్ పెడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.