Abhijeet Bigg Boss 4: బిగ్‌బాస్ 4 సమరం చివరి దశకు చేరుకుంది. టాప్ 5లో అభిజీత్, హారిక, అఖిల్, అరియానా, సొహైల్ నిలవగా.. వీరిలో ఎవరూ ఈ సీజన్ విన్నర్‌గా నిలుస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు తమ ఈ కంటెస్టెంట్‌ల అభిమానులు బయట ప్రచారం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో ఈ సీజన్‌లో హౌజ్‌లో సందడి చేసి బయటకు వచ్చిన వారు కూడా ఇప్పుడు హౌజ్‌లో ఉన్న తమ అభిమాన కంటెస్టెంట్‌లకు సపోర్ట్ ఇస్తున్నారు.
ఇక ఈ ప్రచారంలో ఎక్కువగా అభిజీత్‌కి క్యాంపైన్ నడుస్తోంది. సాధారణ ప్రేక్షకులే కాదు ప్రముఖులు కూడా అభికి ప్రచారం చేస్తున్నారు. ఇక ఈ ప్రచారంలో యాంకర్ లాస్య కూడా పాలుపంచుకున్నారు. హౌజ్‌లో అభి, హారికలతో చాలా క్లోజ్‌గా ఉండే లాస్య, బయటకు వచ్చిన తరువాత వారికి సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఆ ఇద్దరిలో ఎక్కువగా ఇప్పుడు అభికి ప్రచారం చేస్తున్నారు. తాజాగా తన కుమారుడు జున్నుతో అభిజీత్ మామకు ఓటు వేయండి అంటూ ప్లకార్డ్‌ని పెట్టించిన లాస్య.. దాన్ని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
"Vote for Abijeet Mama" - #Junnu 😍@Abijeet#BiggBossTelugu4 #VoteForAbijeet #LasyaManjunath pic.twitter.com/kGEeIGc03G
— Lasya Manjunath (@LasyaManjunath) December 15, 2020
మరోవైపు ఇప్పటికే నటులు నాగబాబు, శ్రీకాంత్, విజయ్ దేవరకొండ, సుధాకర్ తదితరులు అభికి తమ మద్దతును ప్రకటించారు. దీంతో ప్రచారంలో అభి దూసుకుపోతున్నారు. ఇక అభి ఫ్యాన్స్ కూడా నేషనల్ వైడ్‌గా రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో అభినే ఈ సీజన్ విన్నర్‌గా గెలిచినా ఆశ్చర్యపోవక్కర్లేదని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ సారి బిగ్‌బాస్ విన్నర్‌గా ఎవరు నిలవనున్నారు..? అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మరో ఐదు రోజులు ఆగాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor lasya, Bigg Boss 4 Telugu, Tolllywood