ప్రముఖ యాంకర్ లాస్య (Lasya Manjunath) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన యాంకరింగ్‌తో ఒకప్పుడు అదరగొట్టారు. ముఖ్యంగా చీమ ఏనుగు జోక్స్‌తో కూడా బాగా పాపులర్ లాస్య. అయితే పర్సనల్ కారణాల వల్ల కొంతకాలం టీవీ షోకుల గ్యాప్ ఇచ్చిన లాస్య (Anchor Lasya ), ఆ మధ్య బిగ్ బాస్ తెలుగు 4 (Bigg Boss Telugu 4) రియాలిటీషోలో పాల్గోని అదరగొట్టారు. అంతేకాదు ఆమె స్వయంగా ఓ యూట్యూబ్ ఛానల్‌ను మొదలు పెట్టి.. అక్కడ రకరకాల వీడియోలతో అలరిస్తున్నారు. ఇక అది అలా ఉంటే ఆమె తాజాగా లాస్య హాస్పిటల్ పాలైనట్లు తెలుస్తోంది. లాస్య హాస్పటల్ పాలైనట్లు.. ఓ వీడియోను పంచుకున్నారు ఆమె భర్త మంజునాథ్. ఈ విషయాన్ని ఆయన్ను స్వయంగా ఆ వీడియోలో మాట్లాడుతూ.. లాస్యకు ఆరోగ్యం సరిగా లేదని.. ప్రస్తుతం హాస్పటల్లో (Anchor Lasya hospitalized) చికిత్సా తీసుకుంటున్నారని తెలిపుతూ.. గెట్ వెల్ సూన్ అంటూ ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. దీంతో యాంకర్ లాస్యకు ఏమైందంటూ ఆమె ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అయితే ఆమె ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అసలు యాంకర్ లాస్య హాస్పిటల్లో ఎందుకు చేరిందన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు.
ఇక ఆమె యాంకరింగ్ కెరీర్ విషయానికి వస్తే.. తెలుగు యాంకర్లలో లాస్యది ప్రత్యేకమైన స్థానం. చీమ ఏనుగు జోక్స్‌తో సమ్ థింగ్ స్పెషల్ అంటూ క్యూట్ యాంకర్‌గా పేరుతెచ్చుకున్నారు. అనసూయ , రష్మీ, శ్రీముఖి.. లాంటివాళ్లతో పోటీని తట్టుకంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు లాస్య. చురుకైన యాటిట్యూడ్ ఆకట్టుకొనే.. లాస్య కొన్నాళ్లుగా బుల్లితెరపై కనిపించ లేదు. అది అలా ఉంటే టీవీ తెరపై చలాకీ మాటలతో ప్రేక్షకులకి అలరించే లాస్య జీవితంలోను ఎన్నో విషాద గాధలు ఉన్నాయి. అందులో కొన్ని ఆ మధ్య బిగ్ బాస్ తెలుగు 4లో ఓ కంటెస్టెంట్’గా పాల్గొన్న సమయంలో బయటపెట్టారు. లాస్య తన కడుపులో బిడ్డని చంపుకున్న విషయాన్ని చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు.
View this post on Instagram
లాస్య మాట్లాడుతూ.. 2010లో నాకు పెళ్లైంది. అయితే నాకు పెళ్లైనా విషయం చాలా మందికి తెలీదు. నాకు 2010లో పెళ్లైనా మీము వేరు వేరుగా ఉన్నాం. ఆ సమయంలో మా రెండు ఫ్యామిలీలు పెళ్లికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత 2012 నుంచి కలిసి ఉన్నాం. కాగా 2014 లో మా నాన్న నుంచి ఫోన్ వచ్చింది. నువ్వు పెళ్లి చేసుకున్నావని మన కుటుంబంలో ఎవ్వరికీ తెలీదు. అయితే మీరు జీవితంలో ముందు మంచిగా సెటిల్ అవ్వండి. మీ కాళ్ల మీద మీరు నిలబడండి. ఆ తర్వాతే నేనే పెళ్లి చేస్తా అని అన్నారు. మా నాన్న ఆ మాట అనడంతో నాకు చాలా ఆనందం వేసింది. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకు నాకు ఆరోగ్యం బాలేదు. ఏమిటా అని ఆసుపత్రికి వెళ్తే ప్రెగ్నెంట్ అని చెప్పారు డాక్టర్స్. నేను ప్రెగ్నెంట్ అనే ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. నేను నా భర్త రెండు రోజులు ఆలోచించుకున్నాం. ఆ తరువాత కడుపు తీసేయించుకున్నాను.
నా చేతులతోనే నా బేబీని చంపేసుకున్నా. ఆ తరువాత నేను ప్రెగ్నెంట్ కానేమో అని చాలా బాధేసి డిప్రెషన్లోకి వెళ్లాను. ఆ ఘటన తర్వాత 2017లో అందరినీ ఒప్పించి మళ్లీ పెళ్లి చేసుకున్నాము. పెళ్లి అయినా ఐదు నెలల తరువాత మళ్లీ నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఆ ప్రెగ్నెన్సీ నిలవలేదు. మిస్ క్యారీ అయ్యింది. ఆ తర్వాత 2018లో నా కడుపులోకి జున్ను గాడు వచ్చాడు. వాడే నా జీవితంలో వెలుగులు నింపాడు. అంటూ భావోద్వేగం అయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor lasya, Tollywood news