బిగ్ బాస్ 4 తెలుగులో మరో షాకింగ్ ఎలిమినేషన్ లాస్యది. ఎందుకంటే ఈమె ఇప్పట్లో బయటికి వస్తుందని ఎవరూ అనుకోలేదు. కచ్చితంగా టాప్ 3లో ఉంటుందని చాలా మంది అనుకున్నారు. అయితే అనుకోని రీతిలో ఈమె 11వ వారం బయటికి వచ్చేసింది. 11 వారాలు అంటే 77 రోజులు బిగ్ బాస్ హౌజ్‌లో ఉండి ఇంటికి వచ్చింది లాస్య. వచ్చీరాగానే తమ వాళ్ల నుంచి అద్భుతమైన వెల్ కమ్ లభించింది. భర్త మంజునాథ్ అయితే ఈమె కోసం చాలా చేసాడు. ముఖ్యంగా భార్య వస్తుందని తెలిసిన వెంటనే ఆమె కోసం వంట కూడా చేసి పెట్టాడు మంజు. లాస్యకు ఎంతో యిష్టమైన ఆలు ఫ్రై చేస్తున్నట్లు వీడియో చేసాడు మంజునాథ్. తన చేత్తో చేసిన వంట అంటే లాస్యకు యిష్టమని.. అందుకే చేసి పెడ్తున్నా అంటూ పోస్ట్ చేసాడు. ఎలిమినేట్ అయిన వెంటనే ఇంటికే వచ్చి తింటాను అంటూ ఫోన్ చేసిందని.. అందుకే ప్రిపేర్ చేస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు ఈయన. అంతేకాదు జున్నగాడి వీడియోలు కూడా బాగానే పోస్ట్ చేసాడు లాస్య భర్త.
లాస్య లేని ఈ రెండున్నర నెలలు ఆమె లాస్య టాక్స్ యూ ట్యూబ్ ఛానెల్‌ను చాలా బాగా రన్ చేసాడు మంజునాథ్. తాజాగా ఈమెకు హాఫ్ మిలియన్ సబ్‌స్క్రైబర్స్ కూడా వచ్చారు. అందుకే ఇంటికి వచ్చిన వెంటనే కేక్ కూడా కట్ చేయించాడు మంజునాథ్. ఇంట్లోకి వచ్చిన తర్వాత వెల్ కమ్ బ్యాక్ లాస్య అంటూ పెద్ద స్క్రీన్‌లో ఆమె ప్రత్యేకమైన ఫోటోలను జత చేర్చి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఆ తర్వాత కొడుకుతో కలిసి కేక్ కట్ చేయించాడు. ఈ వీడియోలు.. ఎమోషన్స్ చూసిన ఆడియన్స్ మాత్రం లాస్య బయటికి వచ్చిందే మంచిది అయిందని.. ఆమె కుటుంబాన్ని బాగానే మిస్ అవుతుందనే ఇంటికి పంపించేసారంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా అనుకున్న దానికంటే కాస్త త్వరగానే లాస్య ఇంటి నుంచి బయటికి వచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor lasya, Bigg Boss 4 Telugu, Telugu Cinema, Tollywood