బిగ్ బాస్‌లో ప్రస్తుతం ఉన్న అందరు కంటెస్టెంట్స్ కంటే కూడా బయట పాపులారిటీ పరంగా చూసుకుంటే లాస్యకు కాస్త ఎక్కువ పేరు ఉంది. ఆమెకు ముందు నుంచి కూడా క్రేజ్ కూడా దీనికి బాగా హెల్ప్ అయింది. కొన్ని రోజులుగా ఈమె టీవీ స్క్రీన్‌పై కనిపించకపోయినా కూడా లాస్య అంటే ఉన్న డిమాండ్ ప్రస్తుతం ఈమెకు హౌజ్‌లో బాగానే పనికొస్తుంది. అందుకే ఫస్ట్ వీక్ కెప్టెన్ కూడా అయిపోయింది. ఇదిలా ఉంటే ఈమె షోకు రాకముందు ఇంటి దగ్గర చేసుకున్న ప్రిపరేషన్స్‌కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. లాస్య టాక్స్ అంటూ ఓ యూ ట్యూబ్ ఛానెల్ మొదలు పెట్టి అందులో పర్సనల్ వీడియోలు కూడా పోస్ట్ చేస్తుంటుంది లాస్య.
అలాగే తాను బిగ్ బాస్‌కు వెళ్లే 10 రోజుల ముందు వీడియో ఇప్పుడు పోస్ట్ చేసారు. ఈ షోకు వచ్చే కంటే 16 రోజుల ముందే అందర్నీ క్వారంటైన్ చేసి.. తర్వాత కోవిడి నెగిటివ్ రిజల్ట్ వచ్చిన తర్వాతే ఇంటి లోపలికి పంపించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు పోస్ట్ చేసింది లాస్య కుటుంబం. అందులో తన కొడుకు జున్నుతో ఆడుకుంటున్న వీడియోనే ఎక్కువగా ఉంది. తన కొడుకును వదల్లేక వదల్లేక వదిలేసింది లాస్య. కొడుకు బాధ్యతను పూర్తిగా తన కుటుంబానికి వదిలేసి బిగ్ బాస్ షోకు వచ్చింది లాస్య. ప్రస్తుతం ఈ వీడియో కూడా బాగానే వైరల్ అవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor lasya, Bigg Boss 4 Telugu, Telugu Cinema, Tollywood