Lasya Wedding anniversary gift: పెళ్లిరోజు కానుక.. భర్తకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన లాస్య..

యాంకర్ లాస్య మంజునాథ్ (Anchor Lasya)

Lasya Wedding anniversary gift: తెలుగు ప్రేక్షకులకు యాంకర్‌ లాస్య గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. కొన్నేళ్ళ కింది వరకు యాంకరింగ్‌తో మాయ చేసింది. ఆ తర్వాత గతేడాది బిగ్ బాస్ 4లో కనిపించి మళ్లీ మాయ చేసింది.

  • Share this:
తెలుగు ప్రేక్షకులకు యాంకర్‌ లాస్య గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. కొన్నేళ్ళ కింది వరకు యాంకరింగ్‌తో మాయ చేసింది. ఆ తర్వాత గతేడాది బిగ్ బాస్ 4లో కనిపించి మళ్లీ మాయ చేసింది. తన చీమ ఏనుగు జోకులతోనే కాదు బిగ్ బాస్‌లో కొత్త లాస్యను పరిచయం చేసింది ఆడియన్స్‌కు. దాదాపు 70 రోజులు ఈ షోలో ఉంది లాస్య. గత సీజన్ కంటెస్టెంట్స్‌లో అత్యధిక రెమ్యునరేషన్ కూడా లాస్యకే ఇచ్చారు. ఈమెకు రోజుకు 60 వేల వరకు పారితోషికం ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అంటే దాదాపు బిగ్ బాస్ నుంచి 35 లక్షల వరకు సంపాదించుకుంది ఈ భామ. ఇదిలా ఉంటే ఇప్పుడు లాస్య తన భర్తకు కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చింది. తమ పెళ్లి రోజు సందర్భంగా అదిరిపోయే లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చింది. తన భర్త మంజునాథ్‌కు ఈ గిఫ్ట్ ఇచ్చి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపింది లాస్య. ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడటం కోసం కొన్నేళ్ల పాటు పెద్దలతో పోరాటం చేసింది లాస్య. ఒకే వ్యక్తిని రెండుసార్లు పెళ్లి చేసుకుంది కూడా. పెద్దలను ఒప్పించి ఓ సారి.. ఒప్పించకుండా మరోసారి చేసుకుంది లాస్య. పెళ్లికి ముందు యాంకరింగ్‌తో బిజీగా ఉన్న లాస్య.. పెళ్లి తర్వాత మాత్రం దూరమైంది.



వ్యక్తిగత కారణాలతో యాంకరింగ్‌కు దూరంగా ఉంది. అయితే ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీకి సిద్ధమవుతుంది లాస్య. అలాంటి సమయంలోనే బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. తాజాగా కొన్ని షోలకు యాంకరింగ్ కూడా మొదలు పెట్టింది లాస్య. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 15 లాస్య పెళ్లి రోజు. ఈ సందర్భంగా మహీంద్రా ఎక్స్‌యూవీ 500 కారు కొనుగోలు చేసి భర్తకు కానుకగా ఇచ్చింది. దీని ధర 16 లక్షలకు పైగానే ఉంటుంది. ఏ అనుబంధంలోనూ అన్నీ మంచి రోజులే ఉండవు.



తుఫానులా చుట్టేసే కష్టం ఎదురొచ్చినా సరే ఒకే గొడుగు కింద ఉండి దాన్ని ఎదుర్కొందాం. ఆ శక్తి మనకు ప్రేమ అందిస్తుంది.. అంటూ ప్రేమగా రాసుకొచ్చింది లాస్య. అంతేకాదు భర్తతో కలిసి యూ ట్యూబ్ వీడియో కూడా విడుదల చేసింది. అందులో తమ ప్రేమ గురించి.. పెళ్లి గురించి మాట్లాడారు. ప్రస్తుతం ఈ గిఫ్ట్.. వీడియో వైరల్ అవుతున్నాయి.
Published by:Praveen Kumar Vadla
First published: