దుమ్మురేపుతున్న శ్రీముఖి... అస్సలు మిస్ అవ్వొద్దు.. ఫుల్ ఫన్ గ్యారెంటీ...

స్టార్ మ్యూజిక్‌లో ఓ సరికొత్త గేమ్ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది శ్రీముఖి.

news18-telugu
Updated: November 21, 2019, 10:52 PM IST
దుమ్మురేపుతున్న శ్రీముఖి... అస్సలు మిస్ అవ్వొద్దు.. ఫుల్ ఫన్ గ్యారెంటీ...
శ్రీముఖి (Inage;Sreemukhi/Instagram)
  • Share this:
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 రన్నరప్ కొత్త అవతారంతో మళ్లీ బుల్లితెర ముందుకు రాబోతోంది. స్టార్ మ్యూజిక్‌లో శ్రీముఖి కొత్త అవతారం ఎత్తబోతోంది. సెలబ్రేషన్స్ విత్ సెలబ్రిటీ పేరుతో ఓ కొత్త మ్యూజికల్ షోకు శ్రీముఖి హోస్ట్ చేయబోతంది. ఇందులో అంతా మ్యూజిక్ మేజిక్ చేస్తానని చెబుతోంది శ్రీముఖి. దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా స్టార్ మ్యూజిక్ రిలీజ్ చేసింది. స్టార్ మ్యూజిక్ రీలోడెడ్ పేరుతో ఉన్న ఈ వీడియోలో శ్రీముఖి డ్యాన్స్‌లు, పాటలతో దుమ్మురేపుతోంది.సెలబ్రిటీల గేమ్‌ షోలకు బుల్లితెర వీక్షకుల నుంచి బాగా ఫాలోయింగ్ ఉంది. అయితే, కేవలం టాక్ షో మాత్రమే కాకుండా... వారితో పాటలు పాడించడం, ఆటలు ఆడించడం.. నవ్వించడం.. కవ్వించడం వంటి కొత్త కొత్త ప్రయోగాలు కూడా చేయబోతోంది శ్రీముఖి. ఫుల్ ఫన్ గ్యారెంటీ అంటున్న శ్రీముఖి.. ఈ షోను అస్సలు మిస్ అవ్వొద్దని.. అవసరమైతే అలాంటి పెట్టుకొని మరీ చూడాలని పిలుపునిస్తోంది. అయితే, ఈ షో ఎప్పటి నుంచి ప్రారంభం అవుతోందనేది ఇంకా ఖరారు కాలేదు.First published: November 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>