జబర్ధస్త్ షోలో అనసూయకు ప్రమోషన్.. రోజా రాయబారంతో..

ఇప్పటివరకు జబర్ధస్త్ షోలో యాంకరింగ్ చేస్తున్న అనసూయకు ఇప్పుడు బంపర్ ఆఫర్ వచ్చింది.

news18-telugu
Updated: December 15, 2019, 8:22 AM IST
జబర్ధస్త్ షోలో అనసూయకు ప్రమోషన్.. రోజా రాయబారంతో..
అనసూయ, రోజా
  • Share this:
అనసూయ.. ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆమె 'జబర్దస్త్' షో ద్వారా తెలుగువారికి దగ్గరైంది. అంతేకాదు బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలలో ఈ భామ కూడా ఒకరు. ఎప్పటికప్పుడు కొత్త డ్రెస్సులతో తన అందాలతో అభిమానులకు కనువిందు చేస్తూ ఉంటుంది. పలు సినిమాల్లో కూడా నటించి తన నటనతో అందర్నీ మెప్పించింది.  అనసూయ కెరీర్ ఆరంభంలో ఎన్నో సినిమాల్లో నటించింది. మొదటగా ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్‌లోనూ పని చేసింది. అయినప్పటికీ ఆమెకు అంతగా గుర్తింపు దక్కలేదు. ఎప్పుడైతే 'జబర్ధస్త్' షోలో అడుగు పెట్టిందో.. అప్పటి నుంచి అనసూయ ఫుల్ పాపులర్ అయిపోయింది. తర్వాత మంచి మంచి పాత్రల్లో నటించినప్పటికీ జబర్ధస్త్ అనసూయగానే బాగా ఫేమస్ అవుతోంది.

అయితే ఇప్పటివరకు జబర్ధస్త్ షోలో యాంకరింగ్ చేస్తున్న అనసూయకు ఇప్పుడు బంపర్ ఆఫర్ వచ్చింది. అయితే ఇప్పటి వరకు 'జబర్ధస్త్' కామెడీ షోలో యాంకర్‌గానే కనిపించిన అనసూయకు తాజాగా మరో ప్రమోషన్ పొందింది. వచ్చే వారం ఎపిసోడ్‌లో అనసూయ కాస్త రోజా పక్కన కూర్చుని జడ్జ్‌గా బాధ్యతలు నిర్వర్తించనుంది. రోజా అడగడం వల్లే నిర్వహకులు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అలాగే, ఈ ఎపిసోడ్‌కు పోసాని కృష్ణ మురళీ గెస్ట్‌గా వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది. మొత్తం మీద అనసూయకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు రోజా.

First published: December 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>