రామ్ చరణ్‌తో ఆడిపాడనున్న హాట్ యాంకర్ అనసూయ..

చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' పేరుతో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: May 5, 2020, 9:23 AM IST
రామ్ చరణ్‌తో ఆడిపాడనున్న హాట్ యాంకర్ అనసూయ..
రామ్ చరణ్ అనసూయ Photo : Twitter
  • Share this:
చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' పేరుతో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. దాదాపు సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కరోనా కారణంగా ఏర్పడ్డ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ నటిస్తోంది. మరో కీలక పాత్రలో రామ్ చరణ్ కనిపించనున్నాడు. అంతేకాదు చరణ్ పాత్ర దాదాపు ఓ అరగంటకు పైగా ఉండనుందట. ఈ పాత్ర మిగితా పాత్రలకు స్పూర్తిని నింపుతుందట. ఈ సినిమాలో చరణ్‌కు చెల్లెలి పాత్రలో నిహారిక కొణిదెల నటించనుందని సమాచారం. లాక్ డౌన్ తరువాత తదుపరి షెడ్యూల్ మొదలుకానుంది. నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ కలిసి నిర్మిస్తోన్న ఈసినిమాలో ఇప్పుటికే చిరంజీవి రెజీనా కాంబినేషన్‌లో ఓ అదిరిపోయే స్పెషల్ సాంగ్ వుందని తెలిసిందే. అంతేకాదు ఆ పాటను చిత్రీకరించడం జరిగిపోయిందని ఈ పాటలో చిరంజీవి అదరగొట్టాడని రెజీనా ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకోచ్చింది. అయితే తాజాగా వస్తోన్న సమాచారం మేరకు మరో స్పెషల్ సాంగ్ కూడా ఉండనుందని అందులో యాంకర్ అనసూయ నటించనుందని సమాచారం. ఒక సినిమాలో రెండు స్పెషల్ సాంగ్స్ ఎలా వుంటాయనే సందేహం అభిమానుల్లో ఏర్పడింది. అయితే ఈ సినిమాలో అనసూయాపై స్పెషల్ సాంగ్ ఉన్నమాట వాస్తవమేనని అయితే ఆ పాట చరణ్ ఎపిసోడ్ లో ఉంటుందని.. చరణ్‌తో అనసూయ ఆడిపాడుతుందని తెలుస్తోంది.
First published: May 5, 2020, 9:21 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading