హోమ్ /వార్తలు /సినిమా /

Wanted Pandugad: వాంటెడ్ పండుగాడ్ టీజర్ విడుదల.. రాఘవేంద్రరావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Wanted Pandugad: వాంటెడ్ పండుగాడ్ టీజర్ విడుదల.. రాఘవేంద్రరావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Photo Twitter

Photo Twitter

Wanted Pandugad teaser: కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో తెరకెక్కిన వాంటెడ్ పండుగాడ్ టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా రాఘవేంద్ర రావు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ సీనియర్ దర్శకుడు, ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు (K Raghavendra Rao) స‌మ‌ర్ప‌ణ‌లో యునైటెడ్ కె ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న కొత్త చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’ (Wanted Pandugad). శ్రీధ‌ర్ సీపాన ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రంలో సునీల్, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌ (Anasuya), బ్ర‌హ్మానందం (Brahmanandam), వెన్నెల కిషోర్‌, స‌ప్త‌గిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సాయిబాబ కోవెలమూడి, వెంక‌ట్ కోవెలమూడి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ‘పట్టుకుంటే కోటి’ అనేది ఈ సినిమాకు ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఆదివారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ''చిన్న సినిమాలు ఆడటం కష్టమని అనుకుంటున్న తరుణంలో.. చిన్న సినిమాగా వస్తున్న పెద్ద నవ్వుల చిత్రమిది. పెద్ద సినిమాలకు ప్రమోషన్స్ అక్కర్లేదు.. మీరంతా కూడా సిన్సియర్‌గా ప్రమోట్ చేస్తేనే ఓపెనింగ్స్ వస్తాయి. ఇందులో మీడియా సహకారం కూడా కావాలి. ఓటీటీ భూతం ఉంది కాబట్టి.. జనాలను థియేటర్‌కు రప్పించడమే ఈ రోజుల్లో కష్టంగా మారింది. స్క్రిప్ట్ వింటున్నప్పుడే అందరూ ఎంజాయ్ చేశారు. ఎలా తీస్తున్నారా? అని ఓ సారి మారెడుమిల్లికి వెళ్లి చూశాను. మూడు రోజులుందామని వెళ్లా కానీ పది రోజులుండిపోయాను. పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు. పాటలు కూడా అద్భుతంగా తెరకెక్కించారు. ఎంటర్టైన్మెంట్ సినిమాల్లో పాటలు ఎక్కువగా చూడరు. కానీ ఈ సినిమా మ్యూజికల్ ఎంటర్టైన్మెంట్. నల్లమల సినిమాలో ఏమున్నవే పిల్లా అనే పాట విన్నప్పుడే.. పీఆర్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా పెట్టుకోవాలని ఫిక్స్ అయ్యాను. కొత్త వాళ్లకు చాన్స్ ఇవ్వడమే నా ఇంట్రెస్ట్. ఆయన మంచి మ్యూజిక్ ఇచ్చారు. టీం అంతా కష్టపడి చేశారు. అందరికీ థ్యాంక్స్. ఆగస్ట్ 19న ఈ సినిమా రాబోతోంది'' అని అన్నారు.

నిర్మాత జోసెఫ్ మాట్లాడుతూ.. ''రాఘవేంద్రరావు గారితో కలిసి సినిమాను నిర్మించే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. నాకు సహకరించిన సినిమా యూనిట్‌కు థ్యాంక్స్. సినిమా బాగా వచ్చింది. థియేటర్లో ఈ సినిమాను చూస్తే ఆ కిక్ వేరేలా ఉంటుంది. ఆగస్ట్ 19న ఈ చిత్రం రాబోతోంది.అందరూ థియేటర్లోనే చూడండి'' అని అన్నారు.' isDesktop="true" id="1365110" youtubeid="TW_Su-1RlbM" category="movies">

మ్యూజిక్ డైరెక్టర్ పీఆర్ మాట్లాడుతూ.. ''నాకు ఈ అవకాశం ఇచ్చిన రాఘవేంద్రరావు గారికి థ్యాంక్స్. ఆయన పాటలు వింటూ పెరిగాం. ఆయన చెబుతుంటే మేం సినిమా చేయడం ఆనందంగా ఉంది. సంగీతంపరంగా దర్శకుడు నాకు ఎన్నో సలహాలు ఇచ్చారు. దర్శకుడి విజన్.. మా కష్టం.. రాఘవేంద్ర రావు గారి విజన్‌కు మేం అంతా కష్టపడి పని చేశాం'' అని అన్నారు.

సుధీర్ మాట్లాడుతూ.. ''రాఘవేంద్రరావు గారి సినిమాలు చూడటమే అదృష్టం. అలాంటిది ఆయన సినిమాల్లో నటించడం అంటే మా తల్లిదండ్రులో, మేమో ఏదో పూర్వజన్మలో చేసుకున్న సుకృతం. అందుకే మాకు ఈ అవకాశం వచ్చింది. ఆయన దర్శకత్వంలో పని చేయడం ఆనందంగా ఉంది. ఆయన ఎవర్ యంగ్. మారెడుమిల్లిలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడా కూడా అలిసిపోలేదు. మాకంటే ముందుగా కొండలు ఎక్కేవారు. దిగేవారు. మేం ఆయన వెనకాల ఉండేవాళ్లం. ప్రజలందరూ ఈ సినిమాను చూసి ఆదరించాలని కోరుకుంటున్నా'' అన్నారు.

First published:

Tags: Anasuya Bharadwaj, K raghavendar rao, Sudigali sudheer

ఉత్తమ కథలు