హోమ్ /వార్తలు /సినిమా /

KCR- Anasuya: కేసీఆర్ పుట్టిన‌రోజు.. యాంక‌ర్ అన‌సూయ ఏం చేయ‌బోతున్నారో తెలుసా

KCR- Anasuya: కేసీఆర్ పుట్టిన‌రోజు.. యాంక‌ర్ అన‌సూయ ఏం చేయ‌బోతున్నారో తెలుసా

కేసీఆర్ అనసూయ

కేసీఆర్ అనసూయ

Anchor Anasuya: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిబ్ర‌వ‌రి 17న 67వ పుట్టిన‌రోజును జ‌రుపుకుంటోన్న విష‌యం తెలిసిందే. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్ప‌టికే మొద‌ల‌య్యాయి. తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, కేసీఆర్ అభిమానులు ఆయ‌న పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇంకా చదవండి ...

  Anchor Anasuya: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిబ్ర‌వ‌రి 17న 67వ పుట్టిన‌రోజును జ‌రుపుకుంటోన్న విష‌యం తెలిసిందే. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్ప‌టికే మొద‌ల‌య్యాయి. తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, కేసీఆర్ అభిమానులు ఆయ‌న పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మ‌రోవైపు ఆ రోజున ఎంపీ జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ మ‌రో బృహ‌త్త‌ర కార్య‌క్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా కేసీఆర్ పుట్టిన‌రోజు నాడు కోటి మొక్క‌ల‌ను నాటించే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్ట‌బోతున్నారు. కోటి మొక్క‌ల‌ను నాటి కేసీఆర్‌కు పుట్టినరోజు బహుమతిగా ఇవ్వబోతున్నామ‌ని ఆయ‌న ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ప‌లువురు సెల‌బ్రిటీల‌ను కూడా ఇందులో భాగం చేశారు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు త‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లో మొక్క‌ల‌ను నాటారు.

  మరోవైపు ఈ కార్య‌క్ర‌మంలో ఇప్పుడు యాంక‌ర్ అన‌సూయ కూడా భాగం అయ్యారు. కేసీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మొక్క‌లు నాటాలంటూ అమె అంద‌రికీ పిలుపునిచ్చారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు అన‌సూయ‌.

  ఆ వీడియోలో ఈ రాష్ట్రం నాకు ఏమి ఇచ్చింద‌ని కాదు. ఈ రాష్ట్రానికి నేను ఏం ఇచ్చాను అని ఆలోచిస్తున్నారా. అయితే రండి మ‌న భావిత‌రాల కాలుష్యం త‌గ్గించేందుకు మ‌న‌వంతు ప్ర‌య‌త్నంగా ఫిబ్ర‌వ‌రి 17న కేటీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా కోటి వృక్షోత్స‌వంలో పాల్గొందాం. ఆస‌క్తి గ‌ల వారు పాల్గొనండి అంటూ అన‌సూయ పిలుపునిచ్చారు.

  Published by:Manjula S
  First published:

  Tags: Anasuya Bharadwaj, Anchor anasuya, Kcr

  ఉత్తమ కథలు