Home /News /movies /

ANCHOR ANASUYA TO BE SEEN AS AIR HOSTESS FOR HER NEXT HERE ARE THE DETAILS SR

Anchor Anasuya : అనసూయకు మరో అవకాశం... ఈ సారి గగన వీధుల్లో తిరిగేపాత్రలో..

Anasuya Photo : Instagram

Anasuya Photo : Instagram

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ ఓ అందాల హాట్ యాంకర్.. ఎప్పటికప్పుడూ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ పోతోన్న బ్యూటీ.

    Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ ఓ అందాల హాట్ యాంకర్.. ఎప్పటికప్పుడూ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ పోతోన్న బ్యూటీ. ఓవైపు తన మాటలతోనే కాకుండా అందచందాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తూ మరోవైపు వీలున్నప్పుడల్లా సినిమాల్లోను కనిపిస్తూ కనుల విందు చేస్తోంది. అంతేకాదు తెలుగు టీవీ షోలకు గ్లామర్ అద్దిన అతి కొద్ది మంది యాంకర్స్‌లో అనసూయ ముందుంటుంది. ఆమె నటించిన సినిమాల విషయానికి వస్తే.. క్షణంలో తన పాత్రకు.. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకుంది. ఇక అది అలా ఉంటే అనసూయకు మరో సినిమా అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. ఆమె 'ఎయిర్ హోస్టెస్'గా కనిపించనుందని అంటున్నారు. గతంలో 'పేపర్ బాయ్' సినిమాకి దర్శకత్వం వహించిన జయశంకర్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అనసూయను లీడ్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఇప్పటికే 50 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుందట. ఇక అనసూయ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిరంజీవి ఆచార్యలో కీలకపాత్రలో ఆ జబర్దస్త్ భామ నటించనుందట.

    ఈ సినిమాతో పాటు కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తోన్న రంగమార్తాండలో కీలకపాత్రలో కనిపించనుంది. కృష్ణవంశీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న రంగ మార్తండలో కూడా అనసూయ ఓ క్రేజీ రోల్ చేస్తోంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్య క్రిష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నటసామ్రాట్ అనే మారాఠి సినిమాకు రీమేక్‌గా వస్తోంది. ఈ సినిమాలోని ఒక ప్రత్యేక పాత్రకి అనసూయని తీసుకున్నారట. ఈ సినిమాలో అనసూయ దేవదాసిగా నటిస్తోందట. అంటే గుడిలోని దేవుడి ఉత్సవాలలో నాట్యం చేస్తూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండే స్త్రీ పాత్రలో నటిస్తోందట అనసూయ. ఈ సినిమాతో పాటు అనసూయ మహరాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఖిలాడి సినిమాలో నటిస్తోంది.

    వీటితో పాటు అనసూయ మారుతి, గోపీచంద్ పక్కా కమర్షియల్‌‌లో కూడా అనసూయ ఓ పాత్రలో మెరవనుంది. ఓ మలయాళీ సినిమాలో కూడా అనసూయ నటించనుంది. మమ్ముట్టి హీరోగా వస్తోన్న భీష్మ పర్వంలో అనసూయ కీలకపాత్రలో నటించనుంది. అల్లు అర్జున్ పుష్పలో కూడా అనసూయ ఓ కీలకపాత్రలో కనిపించనుంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Anchor anasuya, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు