హోమ్ /వార్తలు /సినిమా /

Anchor Anasuya : దర్శకుడు సంపత్ నంది నిర్మాణంలో అందాల యాంకర్ అనసూయ..

Anchor Anasuya : దర్శకుడు సంపత్ నంది నిర్మాణంలో అందాల యాంకర్ అనసూయ..

యాంకర్ అనసూయ.. Photo : Twitter

యాంకర్ అనసూయ.. Photo : Twitter

Anchor Anasuya : తెలుగు హాట్ యాంకర్ అనసూయ దర్శకుడు సంపత్ నంది నిర్మాణంలో ఓ సినిమాను చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అనసూయ ప్రధాన పాత్రలో కనిపించనుందట. థ్రిల్లర్ జానర్‌లో వస్తున్న ఈ సినిమాతో కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నారని తెలుస్తోంది.

ఇంకా చదవండి ...

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ ఓ అందాల హాట్ యాంకర్.. ఎప్పటికప్పుడూ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ పోతోన్న బ్యూటీ. ఓవైపు తన మాటలతోనే కాకుండా అందచందాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తూ మరోవైపు వీలున్నప్పుడల్లా సినిమాల్లోను కనిపిస్తూ కనుల విందు చేస్తోంది. అంతేకాదు తెలుగు టీవీ షోలకు గ్లామర్ అద్దిన అతి కొద్ది మంది యాంకర్స్‌లో అనసూయ (Anchor Anasuya) ముందుంటుంది. ఆమె నటించిన సినిమాల విషయానికి వస్తే.. క్షణంలో తన పాత్రకు.. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకుంది. ఓ వైపు యాంకరింగ్‌తో బిజీగా ఉంటూనే అనసూయ వరుస సినిమాలతో అదరగొడుతోంది. అందులో భాగంగా ఇప్పటికే పలు సినిమాల్లో నటిస్తున్న యాంకర్ అనసూయ మరో సినిమాకు అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. అనసూయ దర్శకుడు సంపత్ నంది నిర్మాణంలో ఓ సినిమాలో నటించనుందని సమాచారం.

సంపత్ నంది నిర్మాణంలో అనసూయ..

ఈ సినిమా గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇక (Sampath Nandi) సంపత్ నంది తాజాగా గోపీచంద్ హీరోగా సీటీమార్ (Seetimaarr) అనే సినిమాను చేశారు. ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలై మంచి ఆదరణ పొందుతోంది.

Devi Sri Prasad : దేవి శ్రీ ప్రసాద్ ఇంట వరుస విషాదాలు.. సోక సంద్రంలో కుటుంబ సభ్యులు..

ఈ సినిమాతో పాటు అనసూయకు మరో సినిమా అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. ఆమె 'ఎయిర్ హోస్టెస్'గా కనిపించనుందని అంటున్నారు. గతంలో 'పేపర్ బాయ్' సినిమాకి దర్శకత్వం వహించిన జయశంకర్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అనసూయను లీడ్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఇప్పటికే 50 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుందట.

అనసూయ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే..

ఇక అనసూయ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిరంజీవి ఆచార్యలో కీలకపాత్రలో ఆ జబర్దస్త్ భామ కీలకపాత్రలో కనిపించనుందని సమాచారం.

Tollywood Drugs Case : ఈడీ ముందుకు నటుడు తనీష్.. కొనసాగుతోన్న విచారణ...

ఈ సినిమాలతో పాటు కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తోన్న రంగమార్తాండలో కీలకపాత్రలో కూడా అనసూయ కనిపించనుంది. కృష్ణవంశీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న రంగ మార్తండలో కూడా అనసూయ ఓ క్రేజీ రోల్ చేస్తోంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్య క్రిష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నటసామ్రాట్ అనే మరాఠి సినిమాకు రీమేక్‌గా వస్తోంది.

దేవదాసిగా అనసూయ ..

ఈ సినిమాలోని ఒక ప్రత్యేక పాత్రకి అనసూయని  (Anchor Anasuya) తీసుకున్నారట. ఈ సినిమాలో అనసూయ దేవదాసిగా నటిస్తోందట. అంటే గుడిలోని దేవుడి ఉత్సవాలలో నాట్యం చేస్తూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండే స్త్రీ పాత్రలో నటిస్తోందట అనసూయ. ఈ సినిమాతో పాటు అనసూయ మహరాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఖిలాడి సినిమాలో నటిస్తోంది.

వీటితో పాటు అనసూయ మారుతి, గోపీచంద్ పక్కా కమర్షియల్‌‌లో కూడా అనసూయ ఓ పాత్రలో మెరవనుంది. ఓ మలయాళీ సినిమాలో కూడా అనసూయ నటించనుంది. మమ్ముట్టి హీరోగా వస్తోన్న భీష్మ పర్వంలో అనసూయ  (Anchor Anasuya) కీలకపాత్రలో నటించనుంది. అల్లు అర్జున్ పుష్పలో కూడా అనసూయ ఓ కీలకపాత్రలో కనిపించనుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.

First published:

Tags: Anchor anasuya bhardwaj, Tollywood news

ఉత్తమ కథలు